గృహ హింసపై వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్స్..

Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్‌కు తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఇక్కడ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 29, 2020, 9:16 PM IST
గృహ హింసపై వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్స్..
వరలక్ష్మిశరత్ కుమార్
  • Share this:
వరలక్ష్మి శరత్ కుమార్‌కు తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఇక్కడ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. పైగా తమిళనాట ప్రస్తుతం క్రేజీ లేడీ విలన్ కూడా ఈమె. ఇక ఇప్పుడు లాక్‌డౌన్‌ ముచ్చట్లను అభిమానులతో పంచుకుంది వరలక్ష్మి. ముఖ్యంగా ఈ సమయంలో గృహిణిలు ఎదుర్కొంటున్న సమస్యపై మాట్లాడింది ఈమె. ఈ లాక్‌డౌన్ సమయంలో గృహ హింస కేసులు కూడా బాగా నమోదవుతున్నాయని పోలీసులు కూడా చెప్తున్నారు.. లెక్కలు కూడా చెప్తున్నాయి. ఈ లాక్‌డౌన్ అందుకే వనితలను వణికిస్తోంది. ఇంటి పనులకు ఆటంకంగా మారుతోంది కూడా.
వరలక్ష్మిశరత్ కుమార్ (Varalakshmi Sarathkumar)
వరలక్ష్మిశరత్ కుమార్ (Varalakshmi Sarathkumar)


స్వేచ్ఛను హరించడంతో పాటు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు ఆడవాళ్లు. కరోనా వైరస్‌ ఆడవాళ్లకు ప్రియమైన శత్రువుగా మారింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో మహిళలపై వేధింపులు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని.. నాలుగు గోడల మధ్య ఏదైనా జరగొచ్చని వరలక్ష్మి శరత్‌ కుమార్‌ అభిప్రాయపడుతుంది. గృహ హింసకు గురవుతున్న మహిళలకు సాయం చేయమంటూ ఆమె హెల్ప్‌లైన్‌ నెంబరును ట్విటర్‌లో షేర్‌ చేసింది.

మన చుట్టూ ఉన్న మహిళలకు సాయం చేద్దాం.. ఈ లాక్‌డౌన్‌లో గృహ హింస నుంచి వారిని కాపాడుదాం.. వాళ్లు ఇంట్లోనే చిక్కుకుని ఉండొచ్చు.. దయచేసి మీకు తెలిసిన మహిళలకు 1800 102 7282 నెంబరును షేర్‌ చేయండి అంటూ ట్వీట్ చేసింది. వేధించడానికి వయసు.. ఆస్తి స్థాయితో సంబంధం లేదు.. ఎక్కడైనా ఇది జరగొచ్చంటూ ట్వీట్ చేసింది వరలక్ష్మి.
Published by: Praveen Kumar Vadla
First published: April 29, 2020, 9:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading