• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VARALAXMI SARATHKUMAR WILL BE SEEN IN A POLICE OFFICER FOR HER NEXT HERE ARE THE DETAILS SR

Varalaxmi Sarathkumar : కామాంధుల పాలిట సింహ స్వప్నంగా వరలక్ష్మి.. తగ్గేదెలే..

Varalaxmi Sarathkumar : కామాంధుల పాలిట సింహ స్వప్నంగా వరలక్ష్మి.. తగ్గేదెలే..

Varalaxmi Photo : Twitter

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు ఏమో కానీ.. రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ అంటే టక్కున గుర్తు పడుతారు.

  • Share this:
    వరలక్ష్మి శరత్ కుమార్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు ఏమో కానీ.. రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ అంటే టక్కున గుర్తు పడుతారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వరలక్ష్మి ఓ రేంజ్‌లో అదరగొట్టింది. తన నటనతో సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చింది. వరలక్ష్మి ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు. శరత్ కుమార్ కూతురిగా చిత్రసీమకు పరిచయమైన వరలక్ష్మిఇప్పుడు నటిగా తనకంటూ ఓ ప్రత్యేకత ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అది అలా ఉంటే వరలక్ష్మికి మరో మంచి పాత్ర వచ్చినట్లు తెలుస్తోంది. వరలక్ష్మి చేజింగ్‌ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి డ్రగ్స్‌ ముఠా అంతుచూసే పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనుంది. విదేశాల నుంచి డ్రగ్స్‌ చట్టవిరుద్ధంగా మన దేశానికి సరఫరా చేస్తూ కోట్లకు పడగెత్తిన ఓ మాఫియా ముఠా కన్నెపిల్లలపై మత్తు మందును ప్రయోగిస్తూ వారి మాన ప్రాణాలతో చెలగాటమాడుతుంటారట. ఇక కామాంధులను మట్టుపెట్టేందుకు ఒక స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌గా వరలక్ష్మి రంగంలోకి దిగుతుందట. డ్రగ్స్‌ రాకెట్‌ను ఎలా పట్టుకుందనేది కథాంశం. ఈ సినిమాను ఏషియన్‌ మీడియా పతాకంపై మదియళగన్‌ మునియాండి నిర్మించగా.. కేకే కుమార్‌ దర్శకత్వం వహించాడు.

    ఇక వరలక్ష్మి కెరీర్ విషయానికి వస్తే... మొదట్లో హీరోయిన్‌గా చేసిన వరలక్ష్మి పెద్దగా రాణించలేదు. దీంతో తన రూట్‌ను మార్చి విలనీతో కూడిన పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందులో భాగంగా క్రాక్‌లో జయమ్మగా ఆమె చేసిన నటన అందరిని ఆకట్టుకుంది. ఇక తాజా సినిమా నాంది. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ సినిమాలో కూడా వరలక్ష్మి లాయర్ పాత్రలో ఇరగదీసింది. ఈ సినిమాలో ఆమె ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వరలక్ష్మికి మరో మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలకు దీటుగా వుండే పాత్రలను కూడా ఆమెకు ఆఫర్ చేస్తున్నారు మన దర్శకులు.

    Varalaxmi Sarathkumar latest Half saree Photoshoot Goes Viral on Social media
    వరలక్ష్మి శరత్ కుమార్ (Twitter/Photo)


    ఇక వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ హారర్‌ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. రచయిత డార్లింగ్‌ స్వామి దర్శకత్వం వహించనున్నారు. కోనేరు సత్యనారాయణ సమర్పణలో కాంచన కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వరలక్ష్మి తమిళ సినిమాల విషయానికి వస్తే.. ముఖ్యంగా విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'విక్రమ్ వేదాతో పాటు 'విష్మయ’ 'మాణిక్యా’ 'కసాబా' వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక విశాల్ బ్లాక్ బస్టర్ సినిమా పందెంకోడికి సీక్వెల్‌గా వచ్చిన 'పందెం కోడి 2′, ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన 'సర్కార్’ వంటి చిత్రాల్లో లేడీ విలన్ గా కనిపించి అదరగొట్టింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు