• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VARALAXMI SARATHKUMAR TO BE SEEN IN CRAZY ROLE ALLU ARJUN KORATALA SIVA FILM AND NTR TRIVIKRAM FILM HERE ARE THE DETAILS SR

Varalaxmi Sarathkumar : సత్తా చాటుతోన్న జయమ్మ.. ఎన్టీఆర్ అల్లు అర్జున్‌లకు సవాల్..

Varalaxmi Sarathkumar : సత్తా చాటుతోన్న జయమ్మ.. ఎన్టీఆర్ అల్లు అర్జున్‌లకు సవాల్..

Varalaxmi Sarathkumar Photo : Twitter

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు ఏమో కానీ.. రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ అంటే టక్కున గుర్తు పడుతారు.

  • Share this:
    వరలక్ష్మి శరత్ కుమార్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు ఏమో కానీ.. రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ అంటే టక్కున గుర్తు పడుతారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వరలక్ష్మి ఓ రేంజ్‌లో అదరగొట్టింది. తన నటనతో సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చింది. వరలక్ష్మి ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు. శరత్ కుమార్ కూతురిగా చిత్రసీమకు పరిచయమైన వరలక్ష్మిఇప్పుడు నటిగా తనకంటూ ఓ ప్రత్యేకత ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. మొదట్లో హీరోయిన్‌గా చేసిన వరలక్ష్మి పెద్దగా రాణించలేదు. దీంతో తన రూట్‌ను మార్చి విలనీతో కూడిన పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందులో భాగంగా క్రాక్‌లో జయమ్మగా ఆమె చేసిన నటన అందరిని ఆకట్టుకుంది. ఇక తాజా సినిమా నాంది. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ సినిమాలో కూడా వరలక్ష్మి లాయర్ పాత్రలో ఇరగదీసింది. ఈ సినిమాలో ఆమె ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వరలక్ష్మికి మరో మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలకు దీటుగా వుండే పాత్రలను కూడా ఆమెకు ఆఫర్ చేస్తున్నారు మన దర్శకులు. అందులో ఇప్పటికే అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో వరలక్ష్మి కీలక పాత్ర చేయనున్నట్లు టాక్. ఈ సినిమా పుష్ప సినిమా తర్వాత రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అది పూర్తవ్వగానే ఈ సినిమా పట్టాలేక్కనుంది.

    ఇక తాజాగా ఎన్టీఆర్ సినిమాలో కూడా ఓ క్రేజీ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న అయినను పోయిరావలె హస్తినకు అనే సినిమాలో ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో వరలక్ష్మిని ఎంచుకున్నారట. ఈ సినిమా ఇంకొద్ది రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మరోసారి ఎన్టీఆర్ సరసన నటించనుందని టాక్. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించబోతున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

    Happy Birthday Varalaxmi Sarathkumar, krack fame Varalaxmi Sarathkumar, Varalaxmi Sarathkumar age, Varalaxmi Sarathkumar , size, Varalaxmi Sarathkumar lover, Varalaxmi Sarathkumar fb, Varalaxmi Sarathkumar instagram,Varalaxmi Sarathkumar hot, Varalaxmi Sarathkumar news,Varalaxmi Sarathkumar films,varalaxmi sarathkumar,varalaxmi sarathkumar on casting couch,varalaxmi sarathkumar on sexual favors,varalaxmi sarathkumar on film industry,వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్,వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ సినిమాల, jayamma, జయమ్మ
    Varalaxmi sharath kumar Photo : Twitter


    ఇక వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ హారర్‌ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. రచయిత డార్లింగ్‌ స్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రకటించారు. కోనేరు సత్యనారాయణ సమర్పణలో కాంచన కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వరలక్ష్మి తమిళ సినిమాల విషయానికి వస్తే.. ముఖ్యంగా విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'విక్రమ్ వేదాతో పాటు 'విష్మయ’ 'మాణిక్యా’ 'కసాబా' వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక విశాల్ బ్లాక్ బస్టర్ సినిమా పందెంకోడికి సీక్వెల్‌గా వచ్చిన 'పందెం కోడి 2′, ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన 'సర్కార్’ వంటి చిత్రాల్లో లేడీ విలన్ గా కనిపించి అదరగొట్టింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు