హోమ్ /వార్తలు /సినిమా /

Covid 19: వరలక్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కు క‌రోనా పాజిటివ్.. రాధికా శ‌ర‌త్‌కుమార్ రియాక్షన్ చూస్తే..!

Covid 19: వరలక్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కు క‌రోనా పాజిటివ్.. రాధికా శ‌ర‌త్‌కుమార్ రియాక్షన్ చూస్తే..!

Photo Twitter

Photo Twitter

Varalaxmi Sarathkumar: కరోనా కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోల్పోయింది సినీ ఇండస్ట్రీ. ఎందరో సినీ తారలు కోవిడ్ బారినపడి తిరిగి కోలుకున్నారు. అయితే తాజాగా తనకు క‌రోనా సోకింద‌ని తెలుపుతూ తా సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది సినీ నటి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్.

ఇంకా చదవండి ...

దాదాపు రెండేళ్ల నుంచి కోవిడ్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికే కోవిడ్ మూడు వేవ్స్‌ రావడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా మహమ్మారి ఇక పోయినట్లే అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో భయపెడుతూనే ఉంది కంటికి కనిపించని వైరస్. కరోనా కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోల్పోయింది సినీ ఇండస్ట్రీ. ఎందరో సినీ తారలు కోవిడ్ బారినపడి తిరిగి కోలుకున్నారు. అయితే తాజాగా తనకు క‌రోనా సోకింద‌ని తెలుపుతూ తా సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది సినీ నటి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ (Varalaxmi Sarathkumar).

తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యిందని పేర్కొన్న వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కొన్ని సూచనలు ఇస్తూ తన హెల్త్ అప్ డేట్ ఇచ్చింది. తాను అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా సోకిందని, న‌టీన‌టులు సెట్స్‌లో మాస్కులు ధరించడం లేదు. సినిమా యూనిట్‌లో మిగిలిన‌ స‌భ్యులంద‌రూ ధ‌రించేలా ఇక‌నైనా ఒత్తిడి తీసుకురావాల‌ని వరలక్ష్మి కోరింది. ఇటీవలి కాలంలో తనను క‌లిసిన వారంద‌రూ తప్పకుండా కరోనా పరీక్ష చేసుకోండని తెలిపిన ఆమె.. అంతా విధిగా మాస్కులు ధ‌రించండి అని, ఆరోగ్యం పట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి అని పేర్కొంది. కోవిడ్ మ‌హ‌మ్మారి ఇంకా పోలేదు అని వరలక్ష్మి చెప్పింది.

కాగా వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ షేర్ చేసిన వీడియో చూసి రాధికా శ‌ర‌త్‌కుమార్ రియాక్ట్ అయ్యారు. ‘వరు జాగ్రత్తగా ఉండు. నీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని మెసేజ్‌ పోస్ట్ చేస్తూ ల‌వ్ ఎమోజీల‌ను షేర్ చేశారు రాధికా. తమిళ సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మి.. ప్ర‌స్తుతం తెలుగులో యశోద సినిమాలో నటిస్తోంది. స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ య‌శోద సినిమాలో వరలక్ష్మి రోల్ కీలకం కానుందట. ఇకపోతే బాల‌కృష్ణ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న NBK 107లోనూ వ‌ర‌ల‌క్ష్మి భాగమవుతోంది. కోవిడ్ కారణంగా ఆమె కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోనుంది.

Published by:Sunil Boddula
First published:

Tags: Actress Radhika, Tollywood, Varalakshmi sharat kumar

ఉత్తమ కథలు