వరస ఫ్లాపులు వస్తున్నా కూడా రవితేజ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ వరస సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. గతేడాది "టచ్ చేసి చూడు".. "నేలటికెట్".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాలతో వచ్చాడు మాస్ రాజా.ఈ సినిమాలన్ని ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. ఇక "రాజా ది గ్రేట్" తర్వాత రవితేజ.. హిట్టు అన్న విషయాన్నే మర్చిపోయాడు. ప్రస్తుతం మాస్ రాజా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేస్తున్నట్టు సమాచారం. అందులో ఒక పాత్ర కోసం రవితేజ.. మరి యంగ్‌గా కనిపించాలి. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు. మీసాలు ట్రిమ్ చేసి.. కాస్తంత స్లిమ్ అయ్యాడు. ఈ సినిమాను వచ్చే యేడాది జనవరి 24న రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.
ఈ సినిమాతో పాటు రవితేజ.. గోపిచంద్ మలినేనితో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. ఈ సినిమాలో హీరోగా రవితేజకు ఇది 66వ సినిమా. ఇందులో మాస్ రాజా మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో తమిళంలో హీరోయిన్‌గా విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.
Welcoming Talented Actress @varusarath onboard 😊👍👍. #RT66 #Raviteja Anna from sets of #discoRaja pic.twitter.com/tOx6ToQHef
— RAVITEJA TRENDS 🔥🔥🔥 (@Ravitejatrend) November 10, 2019
ఇప్పటికే దక్షిణాదిలో వివిధ భాషల్లో నటించిన వరలక్ష్మి తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. రవితేజ మూవీ ఆమెకు రెండో సినిమా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gopichand malineni, Raviteja, Shruti haasan, Telugu Cinema, Tollywood, Varalaxmi Sarathkumar