HOME »NEWS »MOVIE »varalaxmi sarathkumar comments on radhika says because of her varalaxmi faced troubles here are the details sr

Varalaxmi Sarathkumar : సవితి తల్లి కారణంగా ఇబ్బందులకు గురైయాను.. రాధికపై వరలక్షీ కామెంట్స్..

Varalaxmi Sarathkumar : సవితి తల్లి కారణంగా ఇబ్బందులకు గురైయాను.. రాధికపై వరలక్షీ కామెంట్స్..
రాధిక, శరత్ కుమార్, వరలక్ష్మి Photo : Twitter

Varalaxmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ పేరు తెలుగువారికి పెద్దగా తెలియక పోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మడు తమిళ నటి కాబట్టి. కానీ క్రాక్ సినిమాలో జయమ్మ ఇప్పుడు చాలా పాపులర్ అయ్యింది.

  • Share this:
    వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ పేరు తెలుగువారికి పెద్దగా తెలియక పోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మడు తమిళ నటి కాబట్టి. వరలక్ష్మీ.. తమిళ సూపర్ స్టార్ శరత్ కుమార్ కూతురు. అంటే రాధిక వరలక్ష్మి తల్లి కాదు. శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి. ఇది అలా ఉంటే తన సవతి తల్లి రాధిక గురించి వరలక్ష్మీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వరలక్ష్మీ తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిందనే చెప్పాలి. జయమ్మగా సముద్రఖని సరసన ఆయనకు పోటీగా నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరలక్ష్మీ తన సవితి తల్లి రాధిక గురించి మాట్లాడుతూ.. 'ఆమె నా తల్లి కాదు. కానీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఓ ఫ్రెండ్‌లా ఉంటుంది. అంతేకాదు నా కెరియర్ కు సంబందించిన సూచనలు, గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే నేను ఎప్పుడైనా ఆమెకు ఏదైనా రహస్యం చెబితే.. మాత్రం దాన్ని వెంటనే అందరికీ లీక్ చేసేస్తుంది.

    అయితే అందులో దురుద్దేశం ఉండదు.. అలా పొరపాటున జరిగిపోతుంది.ఇలా నా రహస్యాలను లీక్ చేసి చాలా సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు అంటూ తన సవితి తల్లి రాధిక గురించి చెప్పుకొచ్చింది వరలక్ష్మి.





    ఇక వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో లేడీ విలన్ అవసరమైతే అందరికి గుర్తొచ్చే మొదటిపేరుగా వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో శరత్ కుమార్ కూతురిగా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.






    ఆమె నటించిన సినిమాల్లో ముఖ్యంగా విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'విక్రమ్ వేదాతో పాటు 'విష్మయ’ 'మాణిక్యా’ 'కసాబా' వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక విశాల్ బ్లాక్ బస్టర్ సినిమా పందెంకోడికి సీక్వెల్‌గా వచ్చిన 'పందెం కోడి 2′, ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన 'సర్కార్’ వంటి చిత్రాల్లో లేడీ విలన్ గా కనిపించి అదరగొట్టింది. ఇక తాజాగా రవితేజ, శృతి హాసన్‌లు హీరో హీరోయిన్స్‌గా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్‌లో నటించి తెలుగువారికి మరింత దగ్గరైంది. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:January 20, 2021, 09:24 IST

    टॉप स्टोरीज