చిత్రసీమకు మరో లేడీ డైరెక్టర్.. మరి దర్శకురాలిగా ఆ స్టార్ హీరో కూతురు రాణించేనా..?

పురుషాధిక్యత వేళ్లూనుకుపోయిన చిత్రసీమలో మరో మహిళ.. దర్శకురాలుగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్వరలోనే ఆమె మెగాఫోన్ చేపట్టనున్నారు. ఇన్నాళ్లు నటిగా అలరించిన ఆ హీరోయిన్.. తాజాగా డైరెక్టర్ గా అవతారమెత్తింది. ఇంతకీ ఎవరా హీరోయిన్..?

news18
Updated: October 19, 2020, 9:28 AM IST
చిత్రసీమకు మరో లేడీ డైరెక్టర్.. మరి దర్శకురాలిగా ఆ స్టార్  హీరో కూతురు రాణించేనా..?
  • News18
  • Last Updated: October 19, 2020, 9:28 AM IST
  • Share this:
పురుషాధిక్యత వేళ్లూనుకుపోయిన చిత్రసీమలో మరో మహిళ.. దర్శకురాలుగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్వరలోనే ఆమె మెగాఫోన్ చేపట్టనున్నారు. ఇన్నాళ్లు నటిగా అలరించిన ఆ హీరోయిన్.. తాజాగా డైరెక్టర్ గా అవతారమెత్తింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..? తమిళనాడులో స్టార్ హీరో గా పేరుండి.. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన శరత్ కుమార్ గారాల పట్టి.. వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలుగా సినిమా తీయనున్నారు. నటిగా, సహాయ నటిగా, విలన్ గా పలు సినిమాల్లో నటించిన వరలక్ష్మి తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. తాజాగా.. ఆమె తమిళనాట ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఈ సినిమాకు కన్నామూచి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్. రామస్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఈ చిత్రబృందం.. ‘కన్నామూచి’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. దీనికి ట్విట్టర్ లో విశేష స్పందన లభించింది. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించడమే గాక నటిస్తున్నట్టు సమాచారం. సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వరలక్ష్మికి ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్టులు చేశారు.

‘మహిళా శక్తి’ అంటూ సీనియర్ హీరోయిన్ లు సమంత, రకుల్ ప్రీతి సింగ్, సాయి పల్లవి, కాజల్, త్రిషా, తమన్నా, ఐశ్వర్య, తాప్సి, శ్రుతి హాసన్, సాయేషా సైగల్, రెజీనా కసండ్ర, శ్రద్ద శ్రీనాథ్, అదితి రావ్, హన్సిక, ఆండ్రియా వంటి వాళ్లు వరలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. వీరందరికీ పేరుపేరున ఆమె ధన్యవాదాలు తెలిపారు. హీరోయిన్ లే గాక సందీప్ కిషన్, విఘ్నేశ్ శివన్, అడివి శేషు, జయం రవి, తదితరులు కూడా ఆమెకు విషెస్ తెలిపారు. వరలక్ష్మిని దర్శకురాలిగా చూడం గర్వంగా ఉందన్నారు.

తమిళ్ లో పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించిన వరలక్ష్మి.. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ ద్వారా పరిచయమయ్యారు. మరో చిత్రం నాంది లోనూ ఆమె నటించారు. ఇవేగాక ప్రస్తుతం ఆమె చేతిలో పలు తెలుగు, తమిళ చిత్రాలున్నాయి.

ఏదేమైనా మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండే చిత్ర పరిశ్రమలో మహిళలు దర్శకురాల్లుగా రాణించిన వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఆ కాలంలో విజయనిర్మల.. తర్వాత అంతటి స్థాయిలో పేరు తెచ్చుకున్న వాళ్లు చాలా తక్కువ. ప్రస్తుతం తెలుగు నాట నందిని రెడ్డి సక్సెస్ ఫుల్ దర్శకురాలిగా కొనసాగుతున్నారు. అంతేగాక శ్రీప్రియ (దృశ్యం ఫేమ్) కూడా మంచి సినిమాలు తీసి ఆకట్టుకుంటున్నారు. మరి వరలక్ష్మి సక్సెస్ అవుతారో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
Published by: Srinivas Munigala
First published: October 19, 2020, 9:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading