టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విశాల్ మాజీ లవర్ వరలక్ష్మి శరత్ కుమార్

Varalaxmi Sarathkumar | నటిగా కంటే వివాదాలతోనే పాపులర్ అయిన నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఒకవైపు నటిస్తూనే తోటి నటుడు విశాల్‌తో ప్రేమాయణం ఈమెను మరింత పాపులర్ చేసింది. ఇప్పటి వరకు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  యాక్ట్రెస్‌గా సత్తా చాటిన ఈ భామ..ఇపుడు తెలుగులో కూడా నటిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 17, 2019, 9:11 AM IST
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విశాల్ మాజీ లవర్ వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మిశరత్ కుమార్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 17, 2019, 9:11 AM IST
నటిగా కంటే వివాదాలతోనే పాపులర్ అయిన నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఒకవైపు నటిస్తూనే తోటి నటుడు విశాల్‌తో ప్రేమాయణం ఈమెను మరింత పాపులర్ చేసింది. ప్రస్తుతం ఈ భామకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన ..ఆమె తగ్గ పాత్రలు వరలక్ష్మిని వరిస్తూనే ఉన్నాయి.

ఇప్పటి వరకు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  యాక్ట్రెస్‌గా సత్తా చాటిన ఈ భామ..ఇపుడు తెలుగులో కూడా నటిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్..సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ‘తెనాలి రామకృష్ణ బీ.ఏ, ఎల్.ఎల్.బీ’ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని వరలక్ష్మి అఫీషియల్‌గా కన్ఫామ్ చేసింది.

Varalakshi Sharath kumar To debut Grand Entry To Tollywood టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విశాల్ మాజీ లవర్ వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్


ఈ సినిమాను కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్‌కు కోర్టులో ఎదురు నిలిచే డిఫెన్స్ లాయర్ పాత్రలో వరలక్ష్మి నటించబోతున్నట్టు సమాచారం. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాలో వరలక్ష్మి మరోసారి నెగిటివ్ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నదట. మొత్తానికి తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ మదిని దోచుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్...నేరుగా ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమాతో ఏమేరకు సత్తా చూపుడుతుందో చూడాలి.ఎన్టీఆర్ కథానాయకుడు టీమ్‌తో క్రిష్ చిట్‌చాట్ 


ఇవి కూడా చదవండి 
Loading...
మహేష్ కోసం సుకుమార్ రూటు మార్చాడా..

కథానాయకుడు, మహానాయకుడు తర్వాత బాలయ్య తీన్మార్

టైటిల్‌లో పేరు పెట్టుకోవడానికి భయపడుతున్న టాలీవుడ్ స్టార్స్
First published: January 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...