• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VARA LAKSHMI SARATH KUMAR GREEN SIGNAL TO COMIC THRILLER MHN

Vara Lakshmi Sarath Kumar: వరాలు కామెడీ చేస్తే... థ్రిల్ అదురుద్ది!

Vara Lakshmi Sarath Kumar: వరాలు కామెడీ చేస్తే... థ్రిల్ అదురుద్ది!

Vara Lakshmi Sarath Kumar green signal to comic thriller

Vara Lakshmi Sarath Kumar: హీరోయిన్‌గానే కాదు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన పాత్రలతో వరలక్ష్మి శరత్‌కుమార్‌ తన మార్కును క్రియేట్‌ చేసుకుంటోంది. క్రాక్‌, నాంది సినిమాల తర్వాత మరో వైవిధ్యమైన పాత్రలో నటించడానికి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓకే చేసింది. ఇంతకీ ఆ పాత్ర ఏంటో తెలుసా

  • Share this:
    క్రాక్‌ సినిమా చూశారా? జయమ్మ గుర్తుందా? నాంది సినిమా చూశారా? అడ్వకేట్‌ ఆద్య కాన్ఫిడెన్స్ లెవల్స్ చూశారా? లాయర్‌ కోట్‌ని ఆమె క్యారీ చేసిన విధానం గమనించారా? 2021 ఇలా మొదలైందో లేదో... అప్పుడే అలా తెలుగు సినిమా స్క్రీన్‌ మీద రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌ సినిమాలను ఖాతా వేసుకున్న క్రెడిట్‌ మాత్రం ఒక్క వరలక్ష్మీ శరత్‌ కుమార్‌కే దక్కింది. సినిమాల్లో హీరోయిన్‌ అంటే చిట్టిపొట్టి డ్రస్సులు వేసుకుని, నాలుగు సీన్లు, ఐదు పాటలకు డ్యాన్సులు చేసే బాపతు నేను కాదని ఇప్పటికే తన సెలక్షన్‌ ఆఫ్‌ రోల్స్ ద్వారా చెప్పకనే చెబుతోంది వరలక్ష్మీ శరత్‌కుమార్‌. అందుకే ఆమెను అప్రోచ్‌ అయ్యేవాళ్లు కూడా ఒకింత జాగ్రత్తగా కేరక్టర్లను రాసుకుని మరీ సంప్రదిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు డార్లింగ్‌ స్వామితో సహా. ప్రభాస్‌ నటించిన డార్లింగ్‌ సినిమాకు స్వామి అందించిన స్టోరీ అప్పట్లో జనాలను ఎంతగా మెస్మరైజ్‌ చేసిందో మనకు తెలుసు. ఇప్పుడు అదే డార్లింగ్‌ స్వామి తనకోసం సొంత కథ రాసుకున్నారు. అందులో వరలక్ష్మీ కోసం ఓ మంచి కేరక్టర్‌ రాసుకున్నారు.

    కేరక్టర్‌ అంటే అట్టాంటిట్టాంటిది కాదట. అన్నీ షేడ్స్ ఉన్న కేరక్టర్‌. ఒకవైపు నవ్విస్తుంది. మరోవైపు థ్రిల్లింగ్‌ గా ఉంటుంది. ఎంత వెర్సటైల్‌ కేరక్టర్‌ అంటే , కథ వినగానే మనం సినిమా చేస్తున్నాం అని వరలక్ష్మీ లేచి నిలుచుని స్వామికి ఓకే చెప్పేంత గొప్పగా ఉందట. త్వరలోనే ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు స్వామి. ఇప్పటికే మిగిలిన కేరక్టర్ల కోసం ఆర్టిస్టులను ఫైనలైజ్‌ చేస్తున్నారు. అటు తమిళ్‌లోనూ వరలక్ష్మి హవా మామూలుగా లేదు.

    ఆడదయినా, మగాడయినా కెరీర్‌లో అనుకున్న రేంజ్‌కి చేరుకోవడం ముఖ్యం. అప్పటిదాకా చిల్లర చిల్లరగా కనిపించిన ప్రతిసారీ, పెళ్లెప్పుడు... పెటాకులెప్పుడు అని అడగడం మానేయండి అంటూ హాట్‌గా ఓ రిపోర్టర్‌కి రీసెంట్‌ డేస్‌లో వార్నింగ్‌ కూడా ఇచ్చిందట వరలక్ష్మి. సో ఇప్పటికైతే మన వరాలు ఫుల్‌ ఫోకస్‌ ఒన్లీ ఆన్‌ మూవీస్‌. దట్‌ టు టాలీవుడ్‌ ప్రయారిటీ అన్నది ఇట్టే అర్థమైపోతుంది.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు