Karthika Deepam: స్టార్ మాలో అత్యంత రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఇక సరికొత్త కథనంతో ప్రసారమౌతున్న ఈ సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ ఈ రోజు 1023 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టగా.. గత వారం కార్తీక్ ని పిలవడానికి వెళ్లిన కార్తీక్ రూమ్ లోకి వెళ్ళిన దీప కార్తీక్ నిద్ర లేపకుండా వెనుక తిరుగుతున్న సమయంలో మోనిత ఫోన్ రింగవుతున్న వెంటనే కోపంతో కార్తీక్ ను నిద్రలేపి కోపంతో ఫోను చేతిలో పెడుతుంది.
ఇక మోనిత తన ఫ్రెండ్ పిలిచినా ఆహ్వానానికి.. నేను రెడీ అయి ఉన్నాను నువ్వు రెడీ అయి వచ్చేయ్ అనడంతో కార్తీక్ వెంటనే దీప వైపు చూస్తూ.. నేను రావట్లేదు నేను దీప వాళ్ల పిన్ని వాళ్ళ ఇంట్లో కళ్యాణం కు వెళ్తున్నానని మోనిత తో అనగా వెంటనే దీప ముఖంలో సంతోషం కనబడుతుంది. ఇక మోనిత మండిపోతుంది. నువ్వొస్తావని నేను రెడీ అయి కూర్చున్నాను అని మోనిత అంటే వెంటనే కార్తీక్ నువ్వు వెళ్ళకు.. కళ్యాణానికి నువ్వు కూడా రా అంటాడు. అంతేకాకుండా డాక్టర్ భారతిని కూడా తీసుకొని రా అనగా దీంతో మోనిత సంతోష పడుతుంది. దీప ముఖంలో కోపం కనిపిస్తుంది.
ఇక దీప కార్తీక్ తో కాస్త కోపంగా మాట్లాడితే అక్కడ నుంచి వెళ్లి పిల్లలతో విషయాన్ని చెబుతుంది. ఇక జరిగిన విషయాన్ని గురించి సౌందర్య తో తెలుపుతుంది. ఇక రెడీగా ఉన్న మోనిత డాక్టర్ భారతి ని తీసుకొని కార్ లో వస్తుంది. ఇక భారతి, మోనిత లు దీప, కార్తీక్ ల గురించి మాట్లాడుతున్న సమయంలో.. భారతి మాటల మధ్యలో కార్తీక్ తో పూర్తిగా చెప్పలేకపోయాను అంటూ దీప కండిషన్ చాలా క్రిటికల్ గానే ఉందని భారతి తెలుపుతుంది. ఇక ఈ విషయం మోనిత కు శుభవార్త గా మారుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka