Karthika Deepam: వంటలక్క ప్లాన్‌కు ఒకే చెప్పిన ఏసీపీ రోషిని.. గెట్ అవుట్ మోనిత అంటూ దీప స్ట్రాంగ్ వార్నింగ్?

Karthika Deepam

Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కథ మొత్తం మరింత మలుపు తిరిగింది. మధ్యలో ట్విస్టుల మీద ట్విస్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే తిరుగుతుంది.

  • Share this:
    Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కథ మొత్తం మరింత మలుపు తిరిగింది. మధ్యలో ట్విస్టుల మీద ట్విస్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే తిరుగుతుంది. ఇక ఆనందరావుకి గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీప హాస్పిటల్ లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుండగా మోనిత అక్కడికి వస్తుంది. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తుంది దీప. కార్తీక్ ఫ్రెండ్ మోనితగా మీ మావయ్య గారిని చూసి పోదామని వచ్చాను అంటుంది. ఆయన ఫ్రెండ్ మోనిత లేదు అని దీప అనడంతో కాబోయే భార్య గా వచ్చాను అంటుంది. వెంటనే దీప కోపంతో రగిలిపోతుంది.

    అక్కడ ఓ నర్స్ వచ్చి మోనితను పలకరిస్తుంది. ఇక ఆనందరావుకి అందిస్తున్న చికిత్స గురించి చెబుతుంది. అంతేకాకుండా దీపను రెచ్చగొట్టేలా నర్స్ తో మాట్లాడుతుంది. ఇక ఆ మాటలకు దీప రగిలిపోతుంటే మోనిత మాత్రం లోకం ఈ విధంగానే ఒప్పుకుంటుందని, నువ్వు కూడా ఒప్పుకొని తీరాలని మాట్లాడుతుంది. అంతలోనే దీప మళ్లీ అంజి పేరు తీయడంతో.. నీ కథలు బుర్ర కథలా చెప్పడానికి అంజి వస్తున్నాడు అనడంతో మోనిత ముఖంలో రంగులు మారుతాయి. అంతేకాకుండా దీప మోనితను సిగ్గు శరం లేని నీతిలేని ఓ ఆడదానా నీతో నాకు పోలికేంటి..ఇది మా హాస్పిటల్.. మనుషుల్ని పెట్టి గెంటిస్తా అనడంతో మోనిత తల దించుకొని వెళుతుంది.

    Karthika Deepam

    ఇక 25వ తేదీనపెళ్లి ఏర్పాట్లు చేసుకో, నేను పెటాకులకు ఏర్పాట్లు చేస్తాను.. సరేనా బంగారం అంటూ పంపిస్తుంది. దీప రోషిణి ఇంటికి వెళ్లి మాట్లాడుతుంది. అంజి గురించి అడుగుతుంది. అంతే కాకుండా మోనిత వల్ల తన మామయ్యకు జరిగిన విషయాన్ని తెలుపుతుంది. ఇక అంజి గురించి దీపను ప్రశ్నిస్తుంది రోషిణి. మంచివాడు అనేసరికి..మరి హత్యలు ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నిస్తుంది. ఇక దీప ఆ మాటలతో సలహా ఇచ్చారు మేడం అంటూ తనకు ఓ ఐడియా వచ్చిందని.. ఐడియాని చెప్పేస్తుంది.రోషిణి కూడా ఓకే అంటుంది. మోనిత మాత్రం దీప మాటలు తలుచుకొని కంగారు పడుతుంది. పైగా అంజి గురించి ఎవరికో ఫోన్ చేసి అడగగా అంజి కనబడడం లేదు అనడంతో మరింత షాక్ అవుతుంది. ఇక దీపను పిల్లలు ఆరా తీయడంతో తాతయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చిందని చెబుతుంది. ఇక పిల్లలు అలా ఎలా వచ్చింది అని ప్రశ్నలు వేయడంతో ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకుంటుంది.
    Published by:Navya Reddy
    First published: