Karthika Deepam: చెప్పినట్టుగానే మోనిత పెళ్లి పెటాకులు చేసిన వంటలక్క.. రోషిని దగ్గర దోషిగా డాక్టర్ పాప!

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ గత ఎపిసోడ్ లో భాగంగా హాస్పిటల్ లో మోనిత చేసిన ఉన్మాదం తలుచుకొని భాగ్యం అసలు దానికి ఏమైందే నీ భర్తను వదిలేలా లేదు

  • Share this:
    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ గత ఎపిసోడ్ లో భాగంగా హాస్పిటల్ లో మోనిత చేసిన ఉన్మాదం తలుచుకొని భాగ్యం అసలు దానికి ఏమైందే నీ భర్తను వదిలేలా లేదు అంటూ దీపతో మాట్లాడుతుంది.. ఈ క్రమంలోనే దీప మాట్లాడుతూ దానికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు.. ఏసీపీ రోషినిగారు అంజిని తీసుకు వస్తానని చెప్పింది అంటూ గత ఎపిసోడ్ సాగిపోతుంది. నేడు ఈ సీరియల్ 1104 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. మరి ఈరోజు సీరియల్ లో హైలెట్స్ ఏమిటో తెలుసుకుందాం...

    మోనిత నిద్రపోతూ ఉండగా.. ఫోన్ ఏకధాటిగా మోగుతూనే ఉంటుంది. ఏంటో ఈ ఫోన్ ఇలా మోగుతోంది ఇప్పుడు అమ్మగారిని లేపితే ఏమంటారో లేపకపోతే ఏమంటారో అంటూ ప్రియమణి సంకోచం వ్యక్తం చేస్తుంది. ఏదైనా అర్జెంట్ పనుందేమో అంటూ వెళ్లి అమ్మగారు లేవండి అంటూ లేపుతుంది. ఏంటే.. పడుకోనీవ్వు అంటూ మోనిత అనడంతో టైం 10:30 కావస్తోంది. మీకు ఏకదాటిగా ఫోన్లు వస్తున్నాయి అంటూ చెప్పగానే రిజిస్టర్ ఆఫీస్ నుంచి మోనితకి ఫోన్ మోగుతుంది. ఫోన్ చేత పట్టుకొని హలో సార్ చెప్పండి అంటూ మోనిత అడగడంతో అవతల నుంచి రిజిస్టర్ ప్రసాద్ గారు మోనితకి ఫ్యూజులు ఎగిరిపోయే విషయం చెబుతాడు.

    25వ తేదీ మీ పెళ్ళికి అంజి అనే వ్యక్తి అభ్యంతరం చెప్పాడు.. అతడిని మీరు ఒప్పిస్తే గాని ఈ పెళ్లి జరగదు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ దీపను చాలా తక్కువ అంచనా వేసాను. ఎలాగైనా 25వ తేదీ కార్తీక్ తో నాపెళ్లి జరగాలి లేదంటే దీప చేతిలో నేను ఓడిపోతాను అలా ఓడిపోకూడదు అంటూ మనసులో అనుకుంటుంది. ఈలోగా ప్రియమణి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకురమ్మని చెబుతుంది. ఇక హాస్పిటల్ నుంచి ఆనందరావు ఇంటికి వస్తాడు. కార్తీక్ ను తన తండ్రి తప్పు పడుతూ ఉంటే మీరు కూడా ఇలా అనుమానం పడితే ఎలా మావయ్య అంటూ ఆనందరావుకి దీప సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కార్తీక్ గతంలో అంజి మోనిత గురించి ఏదో చెప్పబోతుంటే అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. మోనితకి అంజికి పెద్దగా పరిచయం లేదు. మరిఈ పెళ్లి ఆపవలసినంత శత్రుత్వం అతనికి ఏముంది నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అంటూ మనసులో అనుకుంటాడు.

    Karthika Deepam
    Karthika Deepam


    ఈలోగా ఏసిపి రోషిని మౌనిత కు ఫోన్ చేసి నిన్ను కలవాలి రమ్మని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఏసీపీ నుంచి ఫోన్ రావడంతో అసలు ఏం జరిగింది?ఈ పెళ్లి ఆపడానికి దీప ఏం ప్లాన్ చేసింది? అసలు అంజిగాడు ఏం చెప్పాడు? అని కంగారులో మోనిత ఉంటుంది.అప్పుడే ప్రియమణి కాఫీ తీసుకు వస్తే ఏంటి నీ కాఫీ గోల అంటూ ప్రియమణిపై విరుచుకుపడడంతో ఆ కాఫీ నాకు ప్రియమణి అంటూ దీప ఎంట్రీ ఇస్తుంది. ఈ విధంగా దీప మోనిత ఇంటికి ఎంట్రీ ఇవ్వడం చూసి మోనితలో కంగారు పుడుతుంది. దీప ఎంట్రీ ఇవ్వడంతో తర్వాత ఎపిసోడ్ మరింత హైలెట్ గా మారింది. అయితే ఏసిపి రోషిని వీరిద్దరిని ఎందుకు రమ్మంది? మోనిత కార్తీక్ పెళ్లి జరుగుతుందా..? లేదా..? అన్న ప్రశ్నప్రేక్షకులలో కొనసాగుతోంది.
    Published by:Navya Reddy
    First published: