VANTALAKKA RETURNS TO HER HOUSE IN TODAYS KARTHIKA DEEPAM SERIAL EPISODE NR
karthika deepam: షాకింగ్ ట్విస్ట్.. పిల్లలకు కూడా చెప్పకుండా వెళ్లిపోయి తన గోతిని తానే తవ్వుకుంటున్న వంటలక్క?
karthika deepam
karthika deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
karthika deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ మా లో అత్యధిక రేటింగ్ లో ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారడంతో సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు.
ఇక దీప అనారోగ్య సమస్య గురించి తెలుసుకోవడానికి.. అంతేకాకుండా కార్తీక్ తనపై కాకుండా తన ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడని.. కారణమేంటని బాగా ఆలోచిస్తుంది దీప. ఇక కార్తీక్ నుండి నిజం తెలుసుకోవడానికి తను మొండిపట్టు చేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా తన పట్టుదలతోనే ఉంటుంది. ఇక దీపకు ఓపిక నశించగా.. కార్తీక్ మారడని అనుకోని తన బస్తీకి తిరుగు ప్రయాణం చేస్తుంది.
ఇక ఇంట్లో వాళ్ళంతా దీప కనపడకపోయేసరికి తెగ వెతుకుతుంటారు. పిల్లలు కార్తీక్ దగ్గరికి వెళ్లి ఏడుస్తుంటారు. దీపం లేకపోయేసరికి అందరూ షాక్ అవుతారు. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందంటూ కుటుంబ సభ్యులంతా ఆలోచనలో పడతారు. ఇక దీప మొత్తానికి వారణాసి ఆటోలో శ్రీ రామ్ నగర్ లోని ఉన్న బస్తీలో తన పాత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక సరోజ ఎదురుపడి నువ్వు ఇంకా ఈ బస్తీ కి తిరిగి రావు అని అనుకున్నాను అనగా.. ఇదే నా పుట్టినిల్లు అంటుంది. ఇక వారణాసిని బాక్సులు ఎవరెవరికి కావాలో కనుక్కోమని పంపిస్తుంది. ఇక దీప తన పాత ఇంట్లోకి అడుగు పెడుతున్న సమయంలో.. అక్కడ అత్తారింట్లో కుటుంబ సభ్యులు దీప కోసం వెతికి అలసిపోతారు. తన మొండితనంతో దీప ఇల్లు వదిలేసి వచ్చి తన పాత ఇంటికి వెళ్లిందంటే.. కథ మళ్ళీ ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీప మొత్తానికి వంటలక్క గా తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. దీప చేసిన పనికి మోనితకు మళ్లీ ప్లాన్ చేసే అవకాశాలు కల్పిస్తున్నట్లు అనిపిస్తుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.