Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ట్విస్ట్ లతో సాగుతుంది. మోనిత బ్రతికే ఉండేసరికి వంటలక్క అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని సీరియల్ ను చూడకుండా ఉండటం లేదు. ఇక దీప అఖండ జ్యోతి వెలిగిస్తున్న సమయంలో మోనిత గన్ తో షూట్ చేసిన సీన్ చూపించగా.. ఆ సీన్ మాత్రం ఈరోజు ఎపిసోడ్ లో చూపించకపోయేసరికి మొత్తానికి వంటలక్కకు ఏం జరగలేదు అని తెలిసింది. కానీ మోనిత మాత్రం తనని ఎలాగైనా కలవడానికి వస్తుంది కదా అంటూ అప్పుడు చంపాలని ప్లాన్ చేస్తుంది. ఇక మరోవైపు పిల్లలు దీప కనిపించకపోయేసరికి ఇంట్లో తెగ టెన్షన్ పడుతుంటారు. అంతేకాకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. సౌందర్య ఇంట్లో భాగ్యం, మురళి కృష్ణ తో పాటు అందరూ ఉండగా దీప పరిస్థితి గురించి మాట్లాడుకుంటారు. తను ఒక దారి వెతుక్కోవడానికి అలా చేస్తుంది అని సౌందర్య వారితో అంటుంది.
ఇక గుడిలో మోనిత సోదమ్మ లా కూర్చొని మాట్లాడుతూ మొత్తానికి దీపను తన దగ్గరకు రప్పించుకుంటుంది. ప్రస్తుతం దీప ఎదుర్కొంటున్న విషయాలను గురించి చెప్పేసరికి దీప షాక్ అవుతూ అలాగే చూస్తుంది. దీపను విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళమంటుంది. దానికి దీప కూడా సరే అనడంతో కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకో అని మోనిత అనేసరికి దీప దండం పెట్టుకుంటుంది.
తన వెంట తెచ్చుకున్న గన్ తీసి దీప కు గురి పెట్టగా అదే సమయంలో గాలి రావడంతో అక్కడ ఉన్న పసుపు కుంకుమ మోనితపై పడటంతో మోనితకు తుమ్ము వస్తుంది. వెంటనే ఎక్స్ క్యూజ్ మీ అనేసరికి దీప కళ్ళు తెరిచి చూస్తుంది. ఇక మోనిత గన్ ను దాచే ప్రయత్నం చేయగా దీపకు అనుమానం వచ్చి ఎవరు నువ్వు అంటూ అడుగుతుంది. అదే సమయంలో దుర్గా రావడంతో దుర్గని చూసి పారిపోతుంది మోనిత.
మోనిత అంటూ దీప అరవడంతో అంజి, దుర్గ లు కలిసి ఏమైంది దీపమ్మ అలా అరుస్తున్నావు అని అనడంతో మోనిత వచ్చిందని అనేసరికి.. దీప మాటలు నమ్మలేక దీపను ఇంటికి పంపిస్తారు. మోనిత సోదమ్మ లాగా వచ్చిందని ఇంట్లో ఎంత చెప్పినా దీప మాటలు ఎవరు నమ్మలేక దీపను చూసి బాధపడతారు. దీప మతిస్థిమితం లేకుండా కనిపిస్తుంది అని అనుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acp roshini, Doctor babu, Karthika deepam, Rathna Seetha, Rowdy durga, Soundarya, Vantalakka