Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు రెప్పపాటు సమయాన్ని కూడా వదలట్లేరు. దీప అమ్మతనం గురించి కార్తీక్ కు నిజం తెలియడం, దీప అనారోగ్య సమస్య మరింత తీవ్రంగా మారడం తో మొత్తానికి సీరియల్ లో సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే దీపకు ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కార్తీక్ సౌందర్య దగ్గర కూర్చొని తెగ బాధపడిపోతుంటారు. ఇక వారి దగ్గరికి మురళీకృష్ణ రెండు బ్రెడ్స్ తీసుకొని వచ్చి ఇస్తుండగా అందులో ఒకటి మీరు తినండి మావయ్య అంటూ ఇచ్చేసి అక్కడి నుంచి బయల్దేరాడు కార్తీక్. ఇక ఆ మాటను విని సౌందర్య షాక్ అవ్వగా మురళి కృష్ణ అవునమ్మా పిలిచాడు అంటూ సంబరపడిపోతాడు.
ఇక కార్తీక్ దీపపై చూపిస్తున్న ప్రేమను చూసి మోనిత తట్టుకోలేక పోతుంది. కార్తీక్ ప్రేమ కోసం ఇంత చేసినా కూడా ఏం లాభం లేదు అనుకుంటూ తన బతుక్కి మోక్షం లేదని చావలనిపిస్తుందంటూ తనలో తాను రగిలిపోతుంది. ఆ సమయంలో కార్తీక్ వచ్చి మోనిత ను ఏం ఆలోచిస్తున్నావ్ అని ప్రశ్నిస్తాడు. దీప గురించి అని తను కవర్ చేయగా.. దీప పరిస్థితి ఏంటి.. నా భార్య గురించి నాకు చెబితే తట్టుకోలేని డాక్టర్ భారతి నీకేమైనా చెప్పిందా అంటూ కావాలంటే ఢిల్లీ, ముంబై నుంచి డాక్టర్స్ ని పిలిపిస్తానని కార్తీక్ అనడంతో మోనిత మండిపోతుంది. ఇక కార్తీక్ గట్టిగా దీప గురించి అడగడంతో.. మోనిత వెటకారపు సమాధానం చెబుతుంది. అయినా కార్తీక్ పట్టించుకోకుండా ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా ఐ డోంట్ కేర్.. నా భార్య బతకాలి.. దట్సాల్ అంటూ ఆవేశంగా అనడంతో మోనిత ముఖంలో రంగులు మారుతాయి.
ఇక మురళీకృష్ణ జరిగిందంతా భాగ్యానికి చెబుతాడు. మోనిత తన ఇంటికి వెళ్లి కార్తీక్ మాటలు తలుచుకుంటూ మండిపోతుంది. అదే సమయంలో ప్రియమణి వచ్చి దీప గురించి అడగంగానే మరింత మండిపోతుంది. ఇక ఆ తర్వాత దీపకు భారతి ఇంజెక్షన్ ఇవ్వగా నిద్ర వస్తుంది కానీ నిద్ర పోకూడదు అని చెబుతుంది. ఆ సమయంలో కార్తీక్ వచ్చి ధైర్యం చెబుతాడు. ఇక తొందరగా ఇంటికి వెళ్ళమని చెబుతాడు కార్తీక్. అంతలో భారతి వచ్చి ఫార్మాలిటీ కోసం సంతకం పెట్టమని కార్తీక్ తో అనగా మరింత బాధ తో చూస్తూ ఉంటాడు కార్తీక్. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ లో దీపని కార్తీకదీపం బయట నుండి చూస్తూ తన గురించి బాధపడుతూ ప్రేమతో తలచుకుంటాడు. వెంటనే దీపకు పల్స్ రేటు పడిపోవడంతో ఊపిరి ఆడకుండా కొట్టుకుంటుంది. ఇది గమనించిన వెంటనే కార్తీక్ డాక్టర్స్ ను పిలిచి దీప దగ్గరికి వెళ్తాడు. దీపకి అలా అవుతుంటే తట్టుకోలేక పోతాడు. అక్కడున్న మరో డాక్టర్ కార్తీక్ బాధను చూసి బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక తర్వాత దీపకు ఏం జరుగుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anandh rao, Doctor babu, Hima, Hot star, Karthika deepam, Monitha, Premi vishwanth, Soundarya, Sourya, Vantalakka