Karthika Deepam: నా మొగుడు సంస్కారవంతుడు.. నీలా బజారుమనిషి కాదు.. మోనితకు వంటలక్క షాక్!

karthika deepam

Karthika Deepam: కార్తీక దీపం ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు మళ్లీ ఎదురుచూస్తున్నారు. తర్వాత జరగబోయేది ఏంటని తెగ ఆరాటపడుతున్నారు.

  • Share this:
    Karthika Deepam: కార్తీక దీపం ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు మళ్లీ ఎదురుచూస్తున్నారు. తర్వాత జరగబోయేది ఏంటని తెగ ఆరాటపడుతున్నారు. అంతేకాకుండా రేటింగ్ కూడా ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చేసింది. ఇక కార్తీక్ తన భార్య పిల్లలతో కలిసి సెల్ఫీ దిగి పిల్లల్ని బయటికి పంపిస్తాడు. ఇక కార్తీక్ దీపతో తాను తప్పు చేయలేదని ఎవరి ముందు తలదించుకోవాల్సిన కర్మ లేదని నిజాయితీగా చెబుతాడు. 25 తారీకు లోపే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని దీప కు నమ్మకం ఇస్తాడు. ఆదిత్య ఇంట్లో కార్తీక్ గురించి రగిలిపోతాడు. అన్నయ్య చేసిన పనికి మన పరువు పోయింది అంటూ ఆవేశ పడతాడు. అమెరికాకు వెళ్లిన సౌందర్యపై మండిపడతాడు.

    ఇక శ్రావ్య ఆదిత్యకు 25 తారీఖున కార్తీక్ పెళ్లి గురించి నిజం చెప్పేస్తుంది. అది విన్న ఆదిత్య షాక్ అవుతాడు. ఇక దీప తమ సెల్ఫీ ఫోటోని చూసి మురిసిపోతుంది. ఆ ఫోటోలో మోనిత గీసిన గీతలను చూసి తుడిచేస్తుంది. అంతలో కార్తీక్ మాటలు గుర్తుకు రావడంతో కూల్ అవుతుంది. ఇక భాగ్యం ఇంటికి మోనిత ఆవేశంగా వెళ్లి తన గురించి హాస్పిటల్స్ లో లేనివన్ని చెబుతుండటంతో మండిపోతుంది. ఇక భాగ్యం అస్సలు ఊరుకోకుండా నోటికొచ్చిన మాటలతో మోనితను దులిపేసుకుంది. దొంగ కడుపు పుట్టించావంటూ.. పోవే పో పనికిరాని కాగితాలు పట్టుకొచ్చి కడుపుతో ఉన్నాను.. కార్తీక్ మత్తులో ఉన్నాడు అంటూ కాకమ్మ కథలు చెప్పకు అంటూ తన స్టైల్లో బాగా కౌంటర్ ఇస్తుంది భాగ్యం. ఇక మోనిత మాత్రం సాక్ష్యం ఉందంటూ ఆవేశంగా మాట్లాడుతుంది.

    ఇక దీప దగ్గరికి వెళ్లిన ఆదిత్య పెళ్లట ఏం చేద్దాం వదినా అంటూ మాట్లాడుకుంటారు. అన్నయ్యను నమ్ముతున్నావా అని ప్రశ్నిస్తాడు. ఇక దీప కార్తీక్ నిజాయితీని నమ్మడంతో కాస్త నమ్మకం గానే ఉంటుంది. ఇక పెళ్లి ఆపడానికి ఏం చేద్దామని అనడంతో ఇప్పుడు మీ అన్నయ్యని ఎవరు నమ్మడం లేదని ఏం చేయగలుగుతామో చూద్దాం అంటుంది. ఇక గతంలో కార్తీక్ కు పిల్లలు పుడతారా లేదా టెస్ట్ చేయించుకోమని చెప్పిన విషయాలు దీపతో చెబుతాడు. ఇక దీప తనను టెస్టుల తో సంబంధం లేకుండా నమ్మారు అంటుంది. ఇక వాళ్ళిద్దరూ మొత్తానికి ఏదో గట్టి ప్లాన్ చేసేలా ఉన్నారు. ఇక మోనిత కడుపుకు కార్తీక్ కారణం కాదని భాగ్యం అన్న మాటలతో నిజంగా ఏదైనా ప్లాన్ చేసి వైద్య పద్ధతిలో కృత్రిమ ప్రయోగాలు చేసిందేమో అనే ఆలోచనలు ఎదురవుతున్నాయి.
    Published by:Navya Reddy
    First published: