Karthika Deepam: ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బుల్లితెర ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను బాగా ఆసక్తిగా చూస్తున్నారు. రేటింగ్ కూడా మొదటి స్థానం లోనే దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే కార్తీక్ ను కోర్టుకు తీసుకెళ్లగా అక్కడే విచారణ జరిగిన సంగతి తెలిసిందే. సౌందర్య కూడా కోర్టులో తన కొడుకు గురించి కొన్ని వాదనలు వినిపించింది. ఇక తన కొడుకు నిర్దోషి అంటూ.. తీర్పుకు ముందే నిర్దోషిగా తేలే నమ్మకం తనకు ఉందని తెలిపింది. మళ్లీ ఓ లాయర్ కార్తీక్ ను విచారణ చేశాడు. ఇక కార్తీక్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్న లాయర్ కొన్ని విషయాలతో చర్చలు చేశాడు. మోనిత చనిపోయిన విషయాన్ని సాక్ష్యాల ద్వారా చూపిస్తేనే అసలు నిజం బయట పడుతుందని అనడంతో.. కాసేపు కోర్టును మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. మోనిత దీపను బెదిరిస్తూనే కారును తన ఇంటి వరకు తీసుకెళ్ళింది. వారణాసి అడ్డుపడటంతో వారణాసికి మత్తుమందు కలిపిన కర్చీఫ్ అడ్డుపెట్టింది. దీప వారణాసికి ఏం జరిగిందో అని కంగారు పడుతుంది.
దీపను బలవంతంగా తను ఉన్న ఇంటికి తీసుకెళ్లగా.. దీప అక్కడ కార్తీక్ ఫోటోను చూస్తూ మోనితపై కోపంతో రగిలిపోతుంది. ఇక మోనిత కార్తీక్ పై ఉన్న ప్రేమ గురించి వివరిస్తుంది. ఇలా మారడానికి కారణం కార్తీక్ అని మాట్లాడుతుంది. దీప కూడా మోనిత మాటలకు గట్టి సమాధానం చెబుతుంది. మర్యాదగా లొంగిపో అంటూ మోనితకు చెబుతుంది.మోనిత వినిపించుకోకుండా తన పంతం తో మాట్లాడుతూ.. నీ అడ్డు తొలగిపోతే నేను అజ్ఞాతంలో నుండి బయటికి వస్తాను అంటూ దీపకు గన్ గురి పెడుతుంది.
ఇది కూడా చదవండి:మోనితకు గన్నుతో గురి పెట్టిన దీప.. త్వరలోనే కార్తీకదీపం సీరియల్ కు శుభం కార్డు?
క్షణాలు లెక్కపెట్టుకో అంటూ మోనిత అనడంతో దీప వెటకారంగా ప్రశ్నిస్తూ మొత్తానికి గన్ తీసుకుంటుంది. మోనితకు గురి పెట్టి బెదిరించగా మోనిత కళ్ళల్లో భయం కనిపిస్తుంది. అందరం కలిసి ఉందామంటూ దీపతో అనేసరికి దీప కోపంతో రగిలిపోయి మోనితపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది. మోనిత భయంతో దీప కాళ్ళు పట్టుకొని భయంతో బ్రతిమాలుతుంది.
ఇది కూడా చదవండి:నువ్వు చచ్చిపో వంటలక్క.. నీ భర్తను నాకు ఇచ్చేసి పో అంటూ మోనిత రాక్షసత్వం?
చంపొద్దు అంటూ ఏడుస్తుంది. క్షమించు దీప అంటూ కార్తీక్ ను వదలనని మాట్లాడేసరికి దీప గట్టిగా క్లాస్ పీకుతుంది. చావు అంటూ గన్ గురి పెడుతుంది. ఇక తరువాయి భాగం లో కోర్టులో తీర్పు పూర్తవుతున్న సమయంలో దీప ఎంట్రీ ఇచ్చి ఒక సాక్ష్యం ఉంది అంటూ చూపిస్తుంది. దీంతో రోషిణితో పాటు అందరూ షాక్ అయి చూస్తారు. అంటే మోనితను మొత్తానికి సాక్ష్యంగా చూపించనున్నట్లు అనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Vantalakka