Karthika Deepam: పిలుస్తుంది కదా నువ్వు వెళ్లు డాక్టర్ బాబు.. నేను అంజితో మాట్లాడి వస్తా.. మోనితకు షాక్ ఇచ్చిన వంటలక్క!

Karthika deepam

Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. అంతేకాకుండా రేటింగ్ విషయంలో కూడా బాగా దూసుకుపోతుంది.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. అంతేకాకుండా రేటింగ్ విషయంలో కూడా బాగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే దీప ఇంటికి వెళ్లిన మోనితను.. దీప క్లాస్ పీకి పంపిస్తుంది. ఇక మోనితకు రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆనందరావు ఫోన్ చేసి రమ్మనడంతో.. ఆ విషయాన్ని కార్తీక్ కు ఫోన్ చేసి చెబుతుంది మోనిత. వెంటనే కార్తీక్, దీప కంగారుపడి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి బయలుదేరుతారు. ఇక ఆనందరావు అక్కడున్న పెళ్లి సర్టిఫికెట్ లను చూసి తెగ ఫైర్ అవుతుంటాడు.మోనిత అక్కడికి చేరుకొని తనలో తాను ధైర్యం తెచ్చుకొని మామయ్య అంటూ పలకరిస్తుంది.

    వెంటనే అంకుల్ ని మామయ్య అంటే కొడుకు స్నేహితురాలు కోడలు కాలేదు.. నరం లేని నాలుక ఏదంటే అది కాదు అని ఎదురు తిరుగుతాడు. మోనిత ఆయన మాటలకు.. మీకు సమాజంలో గౌరవం ఉందని నాలాంటి డాక్టర్ మీ ఇంటి కోడలు అయితే మరింత గౌరవం ఉంటుందని రెచ్చిపోయే మాటలు మాట్లాడుతుంది. ఆనందరావు కూడా గట్టిగా మాట్లాడుతూ నాకు మంచి కోడలు, మనవరాళ్లు ఉన్నాడని నిన్ను కోడలుగా ఒప్పుకునే ప్రసక్తి లేదని మండిపడ్డాడు. అయినా కూడా తన మాటలతో రెచ్చిపోతూ అసలు విషయాన్ని చెప్పేస్తుంది.

    మొత్తానికి తాను కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని మీ ఇంటికి వారసుడు వస్తున్నాడని, మీరు తాత కాబోతున్నారని చెప్పేసరికి వెంటనే ఆనందరావు గుండెను పట్టుకుంటాడు. అది గమనించిన దీప, కార్తీక్ లు వచ్చి పట్టుకోబోతున్న సమయంలో ఆనందరావు కార్తీక్ దూరం పెడతాడు. ఇక దీప మోనిత పై నువ్వు ఆడదానివేనా అంటూ రగిలిపోతుంది. ఆనందరావుకి మోనిత చెప్పిందంతా నాటకమని నిరూపిస్తాను అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంది దీప. ఇక కార్తీక్ వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లగా కార్తీక్ తో వైద్యం తీసుకోడానికి ఒప్పుకోడు ఆనందరావు. నీ వైద్యం, నీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అవసరం లేదు అంటూ మర్యాదగా నా ముందు ఉండకుండా వెళ్ళిపో అని.. నువ్వు ఎదురుగా ఉంటే నువ్వు చేసిన పాపాలు కంటికి కనిపిస్తున్నాయని గెటవుట్ అంటూ కార్తీక్ ను పంపిస్తాడు ఆనందరావు. ఇక కార్తీక్ తండ్రి మాటలను తట్టుకోలేక ఎంతో కుమిలిపోతాడు.
    Published by:Navya Reddy
    First published: