Home /News /movies /

Karthika Deepam: నీకు దుర్గ గుర్తున్నాడా.. అంజి గుర్తున్నాడా.. మోనితకు చమటలు పట్టించిన వంటలక్క!

Karthika Deepam: నీకు దుర్గ గుర్తున్నాడా.. అంజి గుర్తున్నాడా.. మోనితకు చమటలు పట్టించిన వంటలక్క!

karthika deepam

karthika deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం బాగా ఆసక్తిగా మారింది. కథ మొత్తం చివరికి వచ్చేలా కనిపిస్తుంది. పైగా బుల్లితెర అభిమానులు కూడా కార్తీకదీపం ను అసలు వదలట్లేదు

    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం బాగా ఆసక్తిగా మారింది. కథ మొత్తం చివరికి వచ్చేలా కనిపిస్తుంది. పైగా బుల్లితెర అభిమానులు కూడా కార్తీకదీపం ను అసలు వదలట్లేదు. ఏసీపీ రోషిణి.. దీప ఇంటికి వెళ్లి మోనిత కంప్లైంట్ ఇచ్చిన సంగతి గురించి ప్రశ్నిస్తుంది. దీప కూడా అంతే గట్టిగా సమాధానం ఇస్తుంది. పిల్లలున్న వాడితో అలా చేయడం న్యాయమో, అన్యాయమో తేల్చమని ప్రశ్నిస్తుంది. మీ ఆయన్ని వెనకేసుకొస్తున్నావా అని ప్రశ్నిస్తుంది రోషిణి. ఇక దానికి సమాధానం ఇస్తూ.. తన దగ్గరికి వచ్చి 25 న పెళ్లి అనడంతో వార్నింగ్ ఇచ్చి పంపించాను అంటుంది. మొత్తానికి కార్తీక్ ది తప్పు లేనట్లుగా మాట్లాడుతుంది దీప. ఇక కార్తీక్ పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి పోలీస్ కారు తో పాటు రోషిణి కనిపిస్తుంది. ఇక కార్తీక్ రోషిణిని పలకరిస్తాడు.

    భాగ్యం.. మోనిత ఇంటికి వెళ్లి కూల్ గా నవ్వుతూ.. గాజులు, చీర తీసుకొచ్చాను.. నీకు సీమంతం చేస్తాను.. కడుపుతో ఉన్న వారికి చేయాలి కదా అంటుంది మోనితను. అంతేకాకుండా తన కడుపు కథ తేలే వరకు ఇక్కడే ఉంటాను అనడంతో.. మోనిత మాత్రం గట్టిగా మాట్లాడుతూ.. నాకు సీమంతం చేస్తావో లేక నీ కూతురికి పిండప్రధానం చేస్తావో అంటూ పంపిస్తుంది. ఇక పిల్లలు పోలీస్ ఆవిడ ఎందుకు వచ్చిందని ప్రశ్నించడంతో.. ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటుంది దీప. ఇక కార్తీక్ రోషిణి కి మోనిత కంప్లైంట్ ఇచ్చిందా అని, నిన్ను ఏమీ అనలేదు కదా అంటూ అనడంతో ఇక మోనిత ఇచ్చిన కంప్లైంట్ గురించి దీపా, ఆదిత్య చెప్పడంతో వెంటనే ఆవేశంతో ఫైర్ అవుతాడు కార్తీక్.

    ఇక ఆదిత్య కూల్ చేయగా.. అదే సమయంలో కార్తీక్ కు ఫోన్ వస్తుంది. కంగారుగా మాట్లాడుతూ టెన్షన్ పడతాడు. ఏమైంది అని ప్రశ్నించగా రేపు డాడీ వస్తున్నారని, ఆయనకు నిజంగా తెలియదని.. తెలిస్తే ఏం జరుగుతుందోనని టెన్షన్ పడతాడు. ఇక మోనిత.. రోషిణిని దీప గురించి ప్రశ్నించగా దీప చెప్పిన మాటలన్నీ చెబుతుంది. మోనిత మాత్రం తన ఓవర్ యాక్టింగ్ తో రోషిణిని న్యాయం చేయమంటూ బతిమాలుతుంది. ఇక దీప.. మోనిత ఇంటికి ఓ రేంజ్ లో వెళ్తుంది. మోనిత ముందే సోఫాలో దర్జాగా కూర్చుని మోనితకు షాక్ ఇచ్చింది. నీ కడుపు, పెళ్లి సంగతి పక్కన పెట్టు అంటూ.. నీకు దుర్గా గుర్తున్నాడా.. అంజి గుర్తున్నాడా అనేసరికి వెంటనే మోనిత షాక్ తింటుంది. అంతేకాకుండా ఏసీపీ ముందు వాళ్లను హాజరుపరచగా మాట్లాడుకుందాం అనేసరికి మోనిత ముఖంలో రంగులు మారుతాయి. ఇక 25 వ తారీఖున సర్కిల్ చేస్తూ ఈ 25వ తేదీ నీకు పెళ్లి కావాలా? జైలు కావాలా తేల్చుకోవాలా అని షాక్ ఇస్తుంది దీప. మొత్తానికి మోనితకు చెమటలు పట్టించింది దీప.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika Deepam serial, Nirupam paritala, Premi vishwanth, Telugu daily serial, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు