Karthika Deepam: కార్తీక్‌ని ఏకాంత కోరిక కోరిన మోనిత.. ఆనంద్ రావుకు గుండెనొప్పి?

Karthika deepam

Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. పైగా మొండి ధైర్యంతో ఉన్నా మోనితను ఓ రేంజ్ లో దీప ఆడుకోవడంతో అభిమానులు ఇంత మంచి సీన్ లను అసలు మిస్ చేసుకోవడం లేదు.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. పైగా మొండి ధైర్యంతో ఉన్నా మోనితను ఓ రేంజ్ లో దీప ఆడుకోవడంతో అభిమానులు ఇంత మంచి సీన్ లను అసలు మిస్ చేసుకోవడం లేదు. ఇక దీప ఇంటి దగ్గర ముసుగు పెట్టుకొని పడుకున్న మోనితను చూసి షాక్ అవుతుంది. ఇక వెంటనే భయపడ్డావా.. మీరు లోపల పడుకున్నారని ఇక్కడ పడుకున్నాను అంటూ మోనిత అనేసరికి దీప వెంటనే మెడ పట్టుకొని బయటకు లాగుతోంది.

    వెంటనే కార్తీక్ రావడంతో.. కార్తీక్ ను చూసి ఇక్కడే ఉన్నావా అంటూ మీరిద్దరూ ఏకాంతంగా ఉన్నారేమోనని బయట పడుకొని టైం వేస్ట్ చేశాను అంటుంది. కార్తీక్ కోపంతో ఏంటిది అని ప్రశ్నించగా.. సిగ్గు విడిచిన మోనిత నా ఒంటరితనం నీతో ఏకాంతం కావాలని కోరుకుంది.. నువ్వు రమ్మంటే రావు.. నేను వస్తానంటే వద్దంటావు అనేసరికి కోపంతో రగిలిపోతాడు కార్తీక్. కడుపుకి కారణమైనవాడు ఎంత గుర్తొస్తాడో, ఎలాంటి కోరికలు కలుగుతాయో నీకేం తెలుసు.. ఇద్దరు బిడ్డల్ని మోసిన దీపకి తెలుసు అనేసరికి దీప కోపంతో మండిపోతుంది. వెంటనే కార్తీక్ మోనితపై అరుస్తాడు. దీపను అక్క అంటూ రెచ్చగొడుతుంది. అయినా కూడా తన మాటలతో బాగా రెచ్చిపోతుంది మోనిత.

    ఇక దీప తన మాటలతో కడిగి పారేస్తుంది. పిల్లలు ఉన్నారని ఊరుకున్న అంటూ.. మాటలతో చెమటలు పట్టిస్తుంది. మోనితకు భయంతో పాటు గొంతు తడారిపోగా వెంటనే నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది దీప. కార్తీక్ ని పట్టుకొని మా ఇద్దరికీ గుడ్ నైట్ చెప్పు అంటూ నవ్వుతుంది. ఇక అది చూసి తట్టుకోలేక వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. ఉదయాన్నే దీప మాటలు గుర్తు చేసుకొని టెన్షన్ పడుతుంది. అంతలోనే ఆనందరావు మోనితకి ఫోన్ చేసి రిజిస్టర్ ఆఫీస్ కి రమ్మనడంతో.. ఆ విషయాన్ని కార్తీక్ కు ఫోన్ చేసి చెబుతుంది. ఇక ఆనందరావు మోనితతో కోపంగా మాట్లాడుతాడు. ఇక కార్తీక్ దీప లు అక్కడికి చేరుకుంటారు. వెంటనే మోనిత కార్తిక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడంతో ఆనందరావు గుండె పట్టుకొని కింద పడిపోతున్న సమయంలో కార్తీక్, దీప వచ్చి పట్టుకుంటారు. దాంతో ఆనందరావు కార్తీక్ పై కోప్పడతాడు.
    Published by:Navya Reddy
    First published: