VANTALAKKA FIRES ON DOCTOR BABU ABOUT HER AND HER DAUGHTERS FUTURE IN KARTHIKA DEEPAM SERIAL TODAY EPISODE NR
Karthika Deepam: నా పరిస్థితి.. నా పిల్లలా పరిస్థితి ఏంటి.. డాక్టర్ బాబుపై ఎగిరిపడుతున్న వంటలక్క?
karthika deepam
Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం అభిమానులకు ఎటు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక చాలా వరకు ఈ సీరియల్ ని చూడడమే వదిలేశారు. పైగా రేటింగ్ కూడా తగ్గింది. మరి డైరెక్టర్ అసలు ట్విస్ట్ పెట్టి కూర్చున్నాడు.
Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం అభిమానులకు ఎటు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక చాలా వరకు ఈ సీరియల్ ని చూడడమే వదిలేశారు. పైగా రేటింగ్ కూడా తగ్గింది. మరి డైరెక్టర్ అసలు ట్విస్ట్ పెట్టి కూర్చున్నాడు. మరి ఈ సీరియల్ ఏమవుతుందో చూడాలి. దీప ఇంటికి వెళ్లిన సౌందర్య ఇంట్లోకి అడుగు పెడుతున్న సమయంలో వెటకారంగా పలకరిస్తుంది దీప. ఇక సౌందర్య కార్తీక్ బాధ గురించి చెప్పగా దీప కోపంతో రగిలిపోతుంది. ఇక దానితో 25న రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటాడు అని చెప్తూ బాధపడుతుంది దీప. ఇక కార్తీక్ కి మోనిత ఫోన్ చేసి పెళ్లి డేట్ లో అడ్డంకి వచ్చేలా ఉంది.. దీపా అదృష్టమో, నా దురదృష్టం.. పెళ్లి ఆగేలా ఉంది అంటూ కార్తీక్ ని రప్పించుకుంటుంది.
ఇక కార్తీక్ వెళ్తున్న సమయంలో దీప, సౌందర్యలు టిఫిన్ చేయమని అనడంతో అర్జెంట్ పని అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప అక్కడేనేమో అనేసరికి సౌందర్య నీకు ఎలా తెలిసే వాడికి ఏదైనా అర్జెంట్ పని ఉందేమో అంటూ సరిదిద్దుతుంది. ఇక భాగ్యం మోనితను తెగ తిట్టేసుకుంటుంది. ఇక అదే సమయంలో పిల్లలు రావడంతో ప్రేమగా ముద్దాడుతుంది. ఇక కార్తీక్.. మోనిత ఇంటికి వెళ్లేసరికి మోనిత కాస్త ఓవర్ గా మాట్లాడుతుంది. ఇక కార్తీక్ ఏదో ప్రాబ్లం అన్నావు అంటూ ప్రశ్నించగా పిలిస్తే రావని అబద్ధం చెప్పాను అని అంటుంది. ఇక కార్తీక్ కోపం అవుతాడు.
మోనిత మాత్రం తన ఓవర్ మాటలతో రెచ్చిపోతుంది. పెళ్లి గురించి తెగ ఆరాటపడుతుంది.సౌందర్య, దీపాల గురించి లాగొద్దు అని కార్తీక్ గట్టిగా చెబుతాడు. ఇక మోనిత వాళ్ల గురించి అదే విధంగా మాట్లాడటంతో కార్తీక్ కోపంతో షెటప్ అంటూ.. ఆ కుటుంబం నా కుటుంబం.. వాళ్లు అలా కావడానికి నేనే కారణం అంటాడు కార్తీక్. ఇక మోనిత దీపకు, సౌందర్య కి చీరలు తీసుకు వచ్చానని చూపిస్తుంటే కార్తీక్ అక్కడనుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ మోనిత ఆపేలా చేస్తుంది. కార్తీక్ తల పట్టుకుంటాడు. ఇక మోనిత దీప కి వీడియో కాల్ చేసి ఇదిగో దీప నీకు ఏ చీర నచ్చిందో కార్తీక్ అడగమన్నాడు అనేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. ఇక దీప కార్తీక్ ను చూసి కోపడుతుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య అంటూ సౌందర్యని ప్రశ్నించగా సౌందర్య కార్తీక్ వెనుక వేసేలా మాట్లాడుతుంది. దీంతో దీప మరింత రగిలిపోతుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.