Karthika Deepam: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో భాగంగా సౌందర్యకు దీపా ఏం జరిగింది అనే విషయాన్ని చెబుతూ కార్తీక్ కి చూపించిన వీడియోను సౌందర్యకు చూపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ వీడియో చూసిన సౌందర్య ఎంతో షాక్ అవుతుంది కచ్చితంగా మోనితను కార్తీక్ చంపి ఉంటాడని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుంది? నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
సౌందర్య దీప కార్తీక్ మోనితను చంపి ఉంటాడని చెప్పగా మీరు కూడా నమ్మడం లేదా అంటూ దీప ప్రశ్నిస్తుంది.అంతలోనే ఆదిత్య అక్కడికి వచ్చి అన్నయ్య ఎప్పుడూ లేనంత సీరియస్ గా ఇక్కడికి వచ్చి అమ్మ గదిలోకి వెళ్ళి రివాల్వర్ తీసుకొని నాన్నకు మందులు మార్చమని చెప్పి వెళ్ళాడు. అదేవిధంగా భాగ్యం కూడా అక్కడ కార్తీక్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ నిజంగానే కార్తీక్ మోనితను చంపి ఉంటాడని అందరూ నమ్మగా దీప మాత్రం ఆయన తప్పు చేసి ఉండరని చెప్పి స్టేషన్ కి వెళ్లి కార్తీక్ ను కలిసి వస్తానని చెబుతోంది.
ఇక దారిలో ప్రియమని వెళ్తుండగా ఏసిపి రోషిని కారు ఆపడంతో ప్రియమణి మోనిత చావు గురించి తలుచుకొని బాధ పడుతుంది. నన్ను అమ్మ లాగా చూసుకున్న మా అమ్మగారు తల్లి కాబోతున్నారని ఎంతో సంతోషపడ్డాను. ఈ క్రమంలోనే ఆ కార్తీక్ బాబు మా అమ్మని చంపాడు ఎలాగైనా తనకు శిక్షపడేలా చేయడమా అంటూ రోషిని అడుగుతుంది. అప్పుడు రోషిని ముందు నువ్వు కారెక్కు అంటూ ప్రియమని తీసుకువెళుతుంది.
ఇక సౌందర్య హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తానని మాట్లాడుతుండగా.. హోంమినిస్టర్ దగ్గరికి ఎందుకు? మా నాన్న అంత పెద్ద తప్పు ఏం చేశారు?మా నాన్న ఇప్పుడే బయటికి రా రా అంటూ ప్రశ్నల పై ప్రశ్నలు అడుగుతారు.ఆయన నేను మీ నాన్న కోసం కాదు ఒక బిజినెస్ కోసం హోమ్ మినిస్టర్ ని కలవడానికి వెళుతున్నానని చెప్పి పిల్లలను ఓదారుస్తుంది.
ఇక దీప క్యారెజ్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా అక్కడ ఒక కానిస్టేబుల్ తనని అడ్డుకుంటాడు. అంతలోనే అక్కడికి రత్నసీత వచ్చి దీపను లోపలకు తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళిన దీప డాక్టర్ బాబుని చూసి కాస్త ఎమోషనల్ అవుతుంది.ఈ క్రమంలోనే దీప మాట్లాడుతూ మిమ్మల్ని ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు డాక్టర్ బాబు. అని బాధ పడగా అందుకు కార్తీక్ ఇటు వైపు నుంచి చూస్తే నువ్వు జైల్లో ఉన్నట్టు ఉంది దీపా.. గత పది సంవత్సరాల నుంచి నీకు శిక్ష పడుతూనే ఉంది అంటే బాధ పడతాడు.
ఈ విధంగా వీరిద్దరి మధ్య గత సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతారు. మీరు ఈ తప్పు చేసి ఉండరు డాక్టర్ బాబు అంటూ దీప అనడంతో నాపై ఎందుకు అంత నమ్మకం నీకు అని కార్తీక్ అడుగుతాడు.మీరు ఎటువంటి తప్పు చేయలేనప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని దీప ప్రశ్నించడంతో నేను బయట పడాలంటే చాలా బలమైన ఆధారాలు ఉండాలి, ఆ ఆధారాలు లేనప్పుడు నేను తప్పు చేయలేదని ఎలా బయటకు చెప్పను అంటూ కార్తీక్ అంటాడు.
ఈ క్రమంలోనే దీప మాట్లాడుతూ ఎలాగైనా మమ్మల్ని బయటకు తీసుకు వస్తాననీ మిమ్మల్ని బయటకు తీసుకురావడం నా బాధ్యత అంటూ మాట్లాడుతుంది. బయటకు రావడం కష్టం దీపా అంటూ మీరందరూ వెళ్లి అమ్మ నాన్న దగ్గర ఉండండి మీకు ఎలాంటి లోటు ఉండదు అని చెబుతాడు. లోటు అంటే ఏంటి డాక్టర్ బాబు కడుపునిండా అన్నం ఒక్కటి ఉంటే కాదు భర్తకు దూరమైన భార్య పిల్లలకు దూరమైన తండ్రి తల్లిదండ్రులకు దూరమైన కొడుకు అంటే ఇది అంటూ బాధపడుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి కాగా రేపటి ఎపిసోడ్ లో ఏసిపి రోషిని దీపతో మాట్లాడుతూ మీ ఆయన బయటికి రావాలంటే ఒకటే పరిష్కారం. మోనిత శవాన్ని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పమను శిక్ష తక్కువ పడేలా నేను చేస్తానని చెబుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthik, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Vishwanath, Vantalakka