Premi Vishwanath : తెలుగు టీవీ సీరియల్ చరిత్రలో కార్తీక దీపం సీరియల్‌తో ఆలిండియా లెవెల్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వంటలక్క (ప్రేమీ విశ్వనాథ్)... సోషల్ మీడియాలో కుడా ఫుల్ యాక్టివ్ అయిపోతోంది. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోయర్లతో పంచుకుంటోంది. ఆమె నుంచీ ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా చాలు... మహిళలు, పురుషులు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. తాజాగా ఆమె... కేరళలోని త్రిచూర్‌లో ఉన్న లులు కన్వెన్షన్ సెంటర్‌లో వేడుకకు హాజరైంది. అక్కడ LED ప్యానెల్స్, LED బల్బులతో... ఇదివరకు ఎప్పుడూ లేనంత గొప్పగా... షాఫియా మెహందీ నైట్ నిర్వహించారు. లష్ బ్లష్ పూలతో అద్భుతంగా అలంకరించారు. లులు కన్వెన్షన్ సెంటర్ కాస్తా... బ్రైడల్ సీటింగ్ సెంటర్‌గా మారిపోయింది. అలాంటి వేడుకకు వెళ్లిన ప్రేమీ విశ్వనాథ్... ఆ ఈవెంట్‌కి తగినట్లుగానే... అదిరిపోయే కాస్ట్యూమ్‌తో తళుక్కుమంది. పింక్ డ్రెస్‌లో ఆమెను చూసి ఫ్యాన్స్... వంటలక్క అదుర్స్, సూపర్, క్వీన్, గార్జియస్ అంటూ... రకరకాలుగా మెచ్చేసుకుంటున్నారు.
ఇప్పటికే టీఆర్పీ రేటింగ్స్‌లో తొలిస్థానంలో కార్తీక దీపం సీరియల్ కొనసాగుతున్న సంతోషంలో ఉన్న ప్రేమీ విశ్వనాథ్... క్రమంగా సినీ తారల్ని మించి... ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె... ఇప్పుడు రెగ్యులర్‌గా తన అప్‌డేట్స్‌ని ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇటీవలే తన పుట్టిన రోజు వేడుకల విశేషాల్ని కూడా అందరితో పంచుకుంది.
అటు మలయాళ ప్రేక్షకులు, ఇటు తెలుగు ప్రేక్షకులూ అందరూ వంటలక్కను తమ ఇంట్లో సొంత అక్కలా ఫీలవుతున్నారు. దానికి తోడు... కార్తీక దీపం సీరియల్‌లో ఆమె పాత్ర కూడా ఎంతో సెంటిమెంట్‌తో కూడుకున్నది కావడంతో... తెలుగు ప్రజలు ఆమెకు బాగా కనెక్ట్ అయిపోయారు. అందువల్ల ఇప్పుడు ప్రేమీ విశ్వనాథ్... ఏం చేసినా అదో సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోతోంది.
View this post on Instagram
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.