Karthika Deepam: ఆఖరి క్షణాల్లోకి వచ్చాను డాక్టర్ బాబు.. పిల్లలు జాగ్రత్త అంటూ కన్నీళ్లు పెట్టించిన వంటలక్క!

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు.

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు.

  • Share this:
    Karthika Deepam: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు. అంతేకాకుండా స్టార్ మా రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో ఉంది. ఇక కార్తీక్ కారు డ్రైవ్ చేస్తూ దీప గురించి ఆలోచిస్తాడు. ఆ సమయంలోనే దీప తండ్రి రోడ్డుపై కనిపించగా.. మామయ్య అని దాదాపు పదేళ్ల తర్వాత ఆ పిలుపుతో దగ్గర అవుతాడు డాక్టర్ బాబు.

    దీప ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుంది అన్న మాటలు గుర్తు చేసుకొని.. డాక్టర్ బాబు కుమిలి కుమిలి ఏడుస్తాడు. నేను ఇన్ని రోజులు తప్పు చేసానని, పిల్లలను దూరం పెట్టాను అంటూ, నీ మాతృత్వాన్ని అవమానించానంటూ.. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అని కుమిలిపోతాడు డాక్టర్ బాబు. ఇక అది పక్కన పెడితే వంటలక్క ఇంట్లో ఉన్న సౌందర్య దీప గురించి బెంగ పెట్టుకుంటుంది. దీని ఆరోగ్యం ఎలా బాగవుతుంది అంటూ ఆలోచిస్తుంది.

    దీప సౌందర్య దగ్గరికి వచ్చి నేను చనిపోతే డాక్టర్ బాబు మోనితను చేసుకుంటాడా అంటూ నేను సవతి తల్లి దగ్గర పెరిగి నరకం చూశాను అంటూ.. తన బిడ్డలకు ఆ నరకం వద్దు అని ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. దీంతో వెంటనే సౌందర్య, పిల్లలు కంగారుపడి దీప లేపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక వెంటనే కార్తీక్ కూడా లోపలికి రాగా.. దీప దీప అంటూ అరుస్తూ దీపకు నీళ్లు తాపించడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇప్పటికైనా నమ్మండి డాక్టర్ బాబు అంటూ.. నమ్మినట్టు ఒక్క మాటా చెప్పండి డాక్టర్ బాబు.. నా చివరి రోజులు ఇవే అంటూ వంటలక్క ఎమోషనల్ డైలాగ్స్ చెప్పగా ఆ ఘటన ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది.
    Published by:Navya Reddy
    First published: