హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: నా పవిత్రతను రుజువు చేసుకోకుండానే కన్నుమూస్తానా అత్తయ్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న వంటలక్క?

Karthika Deepam: నా పవిత్రతను రుజువు చేసుకోకుండానే కన్నుమూస్తానా అత్తయ్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న వంటలక్క?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ స్టార్ మా లో అన్ని సీరియల్ లో కంటే అత్యధికంగా రేటింగ్ తో దూసుకుపోతుంది.

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ స్టార్ మా లో అన్ని సీరియల్ లో కంటే అత్యధికంగా రేటింగ్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ కాస్త కొత్తదనంతో ఉండటంతో మరింత ఆసక్తిగా మారింది. మొత్తానికి తనకున్న అనారోగ్య సమస్య గురించి తెలుసుకుంది దీప. దీంతో కార్తీక్ తో మరింత ప్రేమతో దగ్గర అవుతూనే.. పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తుంది. ఇక కార్తీక్.. దీప లేకుంటే పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాడు. ఇక భాగ్యం.. మురళి కృష్ణ తో దీప పరిస్థితి గురించి తెలుపుతూ.. కార్తీక్ ను సర్దుకోమని చెప్పమని చెబుతుంది.

ఇక పిల్లలుఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటూ మాట్లాడుకుంటారు. ఆ సమయంలో వారణాసి రావడంతో కాసేపు కామెడీ పట్టిస్తారు. ఇక కార్తీక్ దీప విషయం గురించి ఆలోచిస్తాడు. ఇక వంటగదిలో పిల్లలు దోశలు వేయడం ఎలా ప్రయత్నించగా అవి కింద పడిపోవడం తో అరుస్తారు. వెంటనే కార్తీక్ అక్కడికి వెళ్లి పిల్లల్ని పంపించి తను దోసలు వేస్తాడు. ఇక కార్తీక్ దీపని నిద్ర లేపి కాఫీ ఇస్తాడు. ఇక దీప సంతోషం లో మునుగుతుంది. ఇక తనకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి.. అవి తీరకుండా పోతున్నాను.. ఓకే గ్లాసులోని కాఫీ ఇద్దరం కలిసి తాగాలని పెళ్లయినప్పటి నుంచి కోరిక అనగానే వెంటనే దీప చేతిలో కప్పు తీసుకొని తను కొంచెం తాగి దీపకి ఇస్తాడు. ఇక్కడ కాస్త రొమాంటిక్ గా సాగుతుంది వారిద్దరి మధ్య.

ఇక కమింగ్ అప్ లో సౌందర్య దీపని కలవడంతో.. దీనిపై ఇచ్చే విధానాన్ని అర్థం చేసుకొని విషయం తెలిసిందా అంటూ.. వాడు చెప్పేసాడా అంటూ.. నువ్విలా దిగులు చెందుతావని చెప్పలేక పోయాను అంటుంది సౌందర్య. ఇక దీప ఏడుస్తూ ఒకవేళ నేను పోతే నా పవిత్రత నిరూపించుకోకుండా పోతానా అంటూ బాధపడుతుంది.

First published:

Tags: Archana, Deepa, Karthik, Kathika deepam serial, Monitha, Nirupam paritala, Premi Vishwanath, Shoba shetty, Soundarya, Vantalakka

ఉత్తమ కథలు