హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: నా అంతిమయాత్రకు రండి అంటూ డిప్రెషన్‌కు గురైన వంటలక్క.. తండ్రి కన్నీళ్లు..?

Karthika Deepam: నా అంతిమయాత్రకు రండి అంటూ డిప్రెషన్‌కు గురైన వంటలక్క.. తండ్రి కన్నీళ్లు..?

karthika deepam

karthika deepam

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు నిమిషం కూడా వదలకుండా చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతుంది.

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు నిమిషం కూడా వదలకుండా చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక దీప కు తన ఆరోగ్య సమస్య ఏంటో కార్తీక్ చెప్పగానే అప్పటి నుండి మరింత ఆలోచనలో మునుగుతుంది. పిల్లల భవిష్యత్తు ఎలా అని బాగా ఆలోచిస్తుంది. దీప మరి ఆలోచనలోకి లీనమవ్వడానికి చూసి తట్టుకోలేక తనను ఓదారుస్తాడు. పిల్లలు తట్టుకోలేరు ధైర్యంగా ఉండు అని భరోసా ఇస్తాడు. ఇక దీప కార్తీక్ చెప్పిన మాటలు విని ఈ క్షణంలో కూడా భుజం మీద చెయ్యి వేసి ఓదార్చ అనిపించడం లేదా అని ఎమోషనల్ గా అనేసరికి వెంటనే కార్తీక్ ఎమోషనల్ తో తన పై చేయి వేసి ప్రేమగా మాట్లాడుతాడు.

ఇక దీప కూడా ప్రేమగా కార్తీక్ దగ్గరికి చేర్చుకొని ఎమోషనల్ అవుతుంటారు. అందరూ నిద్రపోతున్న సమయంలో మురళి కృష్ణ దీప గురించి ఏదో కల వచ్చింది అంటూ లేచి కంగారు పడుతూ ఉంటాడు. దీంతో భాగ్యం ధైర్యం చెప్పి దీపతో ఫోన్ చేస్తుంది. ఇక దీప ఫోన్ హాల్లో కార్తీక్ కూర్చున్న సోఫా దగ్గర ఉండగా వెంటనే కార్తీక్ ఫోన్ తీసుకొని కంగారు పడవద్దు అని దీప తో మాట్లాడిస్తాడు. ఇక దీప తన భవిష్యత్తు లో తనకు వచ్చే ముప్పు గురించి దృష్టిలో పెట్టుకొని తన తండ్రి తో మాట్లాడుతుంది. తల్లి తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మ అంటూ తెగ ప్రాధేయపడతాడు. బాధపడుతూ ఉంటాడు దీప తండ్రి . ఇక దీప ధైర్యం చెప్పి ప్రశాంతంగా పడుకోమని చెబుతుంది.

ఇక దీప తన మనసులో తన తండ్రి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని మొత్తానికి కనపడకుండా పోతున్నాను నాన్న. అప్పుడు ఏమై పోతావు. నిన్ను ఎవరు ఓదారుస్తారు నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ ఓదారుస్తూ తన తండ్రి తో మాట్లాడిన మాటలు కార్తిక్ తో చెబుతుంది దీప. అందులో ఓ మాటకు కార్తీక్ తెగ బాధ గా చూస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ కు తన తండ్రి సాయంత్రం దారిలో కనిపించాడని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడని అంటాడు. ఇక అక్కడి నుంచి దీప బాధగా వెళ్ళిపోయి. పిల్లల పక్కన పడుకుంటూ తన నాన్న గురించి ఏమైపోతాడో అని బాధతో కుమిలిపోతుంది.

First published:

Tags: Deepa, Kathika deepam serial, Monitha, Premi Vishwanath, Shoba shetty, Soundarya, Vantalakka

ఉత్తమ కథలు