Home /News /movies /

VANTALAKKA DEEPA EMOTIONAL ABOUT HER HEALTH WITH DOCTOR BABU IN KARTHIKA DEEPAM SERIAL NR

Karthika Deepam: నిజం తెలుసుకున్న దీప.. ఇప్పుడు కూడా నన్ను తాకాలనిపించడం లేదా డాక్టర్ బాబు అంటూ?

karthika deepam

karthika deepam

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది

    Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. రేటింగ్ విషయంలో ఈ సీరియల్ స్టార్ మా లో మొదటి స్థానంలో ఉంది. ఇక రోజు రోజుకు ఎంతో ఆసక్తిగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను మరింత దగ్గరగా చేసుకుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.



    కార్తీక్ దీప ఉన్న ఇంటి దగ్గరికి వెళ్లి దీపం ఇంటికి వెళదాం అని అనగా దీప మాత్రం మొండిపట్టు తోనే ఉంటుంది. ఇక ఎంత చెప్పినా దీప వినకపోయేసరికి అక్కడినుంచి కార్తీక్ వెళ్తుండగా దీప అడ్డుపడుతుంది. నాకు సమాధానం కావాలి అంటూ కార్తీక్ ఎదురుగా నిల్చొని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ తన మొండి మాటలతో ఇక నుంచి వెళ్ళాలి అంటుంటాడు. కాని దీపం మాత్రం నిజం చెప్పి తీరాలి అంటూ పట్టుదలతోనే ఉంటుంది. ఇక కార్తీక్ అక్కడినుంచి తప్పించుకుంటున్న తరుణంలో వెంటనే దీప కార్తీక్ చెయ్యి పట్టుకొని నన్ను చంపేయండి అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక కార్తీక్ వెంటనే ఎమోషనల్ అవుతూ నువ్వే చావబోతున్నావంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు. దీంతో దీప షాక్ అవుతూ అయ్యోమయమవుతుంది. పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంది.



    ఇక కార్తీక్ కూడా తనను ఇన్ని శఫథాలు పెట్టడానికి కారణం నీ ఆరోగ్యం కోసమే అంటూ నిజాలు చెబుతాడు. ఇక దీప ఏడుస్తూ కుమిలిపోతుంది. కార్తీక్ చేతులు పట్టుకొని కూలబడుతుంది. ఇక అక్కడ అ కార్తీక్ కూడా ఎమోషన్ అవుతుండగా.. దీపా ఈ లోకం నుండి వెళ్లిపోవడానికి బాధ ఏం లేదు అంటూ కార్తీక్ పై మళ్లీ విరుచుకుపడే మాటలు మాట్లాడుతుంది. ఇక కార్తీక్ కోపంతో బాగా రగిలిపోతాడు. అలా వారిద్దరి మధ్య కాసేపు ఎమోషనల్ సీన్స్ జరగగా.. ఇక కార్తీక్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని మోనిత ఆలోచిస్తుంది. కార్తీక్ చేర దీసుకోవడానికి.. ఇక ఇప్పటి నుండి దూరంగా ఉండాలని అనుకుంటుంది. ఇక రాత్రి అందరూ ఒకే ఇంట్లో ఉండగా తమ తమ ఆలోచనలతో ఉంటారు. ఇక తర్వాత ఎపిసోడ్ లో దీప, కార్తీక్ ఒకే దగ్గర కూర్చొని ఎమోషనల్ అవుతున్న సీన్ చూస్తే ఎంతో భావోద్వేగంతో కూడినట్లు ఉంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Archana, Deepa, Karthik, Kathika deepam serial, Monitha, Nirupam paritala, Premi Vishwanath, Shoba shetty, Soundarya, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు