Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సీరియల్ ఎంతో మంది ప్రేక్షకులను టీవీల ముందు వాలిపోయేలా చేయగా.. చూసిన ఎపిసోడ్ నే మళ్ళీ మళ్ళీ ఫోన్ లలో కూడా చూస్తూ మునిగిపోయారు. ఇక అన్ని సీరియల్ లో కంటే రేటింగ్ విషయంలో మొదటి స్థానంలో ఉన్న ఈ సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా అనిపించింది. మొత్తానికి దీప అనారోగ్యం సమస్య గురించి కార్తీక్ చెప్పగానే.. ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. ఇక దీప తన పిల్లలు ఏమవుతారు అని తన గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ బయట సోఫాలో కూర్చొని దీప ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇకపైన గదిలో పిల్లలతో ఉన్న దీప.. పిల్లలు కథ చెప్పమ్మా అని అడగడంతో అలాగే చూస్తూ ఉంటుంది. ఇక హిమ మళ్లీ అడగనులే అమ్మ ఈసారి లాస్ట్ సారే అని అనగా ఆ మాట విన్న కార్తిక్ దీప అనారోగ్యం విషయం తలచుకుని బాధపడతాడు. ఇక పిల్లల కోరికమేరకు తన పరిస్థితికి తగ్గట్టుగా ఆవు, పులి లా కథ చెబుతుంది. ఇక ఈ ఆవు పులి కథలో పులి.. ఆవు ను తిననడానికి వచ్చినప్పుడు తన దూడ పిల్ల ఆకలితో ఉంటుందని.. నా కోసం ఎదురుచూస్తూ ఉంటుందని దానికి కడుపునిండా పాలు ఇచ్చి వస్తాను అని చెప్పి మళ్ళీ పులి దగ్గరికి వస్తుంది. ఇక పులి తన నిజాయితీని మెచ్చుకుని తనని వదిలేస్తుంది. ఇక ఆ కథ ఆధారంగా దీప ఈ కాలంలో అలా వదిలేస్తుందా అని మృత్యువు రూపంలో వస్తున్న తన భవిష్యత్తుని గుర్తుచేసుకొని మాట్లాడుతున్న తరుణంలో కార్తీక్ గుండెకి ఈ మాటలు గుచ్చుకుంటాయి.
ఇక దీప తన మనసులోని పులిలా పొంచి ఉన్న మృత్యువు.. ఈ అమ్మని జాలి తలచి వదిలేయకపోతే.. మీరు ఏమైపోతారు అమ్మ అన్ని పిల్లలను తలుచుకొని అనుకుంటుంది. ఇక ఈ సీన్ మొత్తం బాగా ఎమోషనల్ గా ఉండగా మరోవైపు మురళీకృష్ణ దీప కోసం బాధపడుతూ మద్యం సేవిస్తాడు. దీపని మనతోనే ఉంచుకుందాం అంటూ భాగ్యంతో మందు మత్తులో వాగేస్తుంటాడు. ఇక దీపం మెట్లమీద కూర్చొని తన గతాన్ని నుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలను తలుచుకుంటూ ఉంటుంది. ఈ పక్కనే సోఫాలో పడుకొని ఉన్న కార్తిక్ ఉలిక్కిపడి లేచి దీప దగ్గరికి వెళ్లి ఊరుకోబెడతాడు. ఇక దీప ఎందుకో ఈ గమ్యం లేని ప్రయాణం అంటూ తన తల్లి నుండి కార్తీక్ వరకు అందరూ వదిలేశారని మాట్లాడుతుంది. దీంతో కార్తీక్ ఎంతో బాధగా చూస్తుంటాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Archana, Deepa, Karthik, Kathika deepam serial, Monitha, Nirupam paritala, Premi Vishwanath, Shoba shetty, Soundarya, Vantalakka