హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam : మంగళసూత్రంతో కార్తీక్ ముందు నిల్చున్న మోనిత.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వంటలక్క.. ఆతర్వాత

Karthika Deepam : మంగళసూత్రంతో కార్తీక్ ముందు నిల్చున్న మోనిత.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వంటలక్క.. ఆతర్వాత

karthika deepam

karthika deepam

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. కథ మొత్తం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక కార్తీక్ దగ్గరికి ఆనందరావు, సౌందర్య బయలుదేరగా సౌందర్య ఫోన్ మర్చిపోవడంతో దీప ఫోన్ చేసి అలాగే మాట్లాడుతుండగా

ఇంకా చదవండి ...

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. కథ మొత్తం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక కార్తీక్ దగ్గరికి ఆనందరావు, సౌందర్య బయలుదేరగా సౌందర్య ఫోన్ మర్చిపోవడంతో దీప ఫోన్ చేసి అలాగే మాట్లాడుతుండగా సౌర్యకు అసలు నిజం తెలుస్తుంది. ఫోన్ మర్చిపోయారని కోపంగా మాట్లాడుతుంది. వాళ్ల మాటలకు దీప టెన్షన్ పడుతుంది. హాస్పిటల్లో కార్తీక్ మౌనంగా కూర్చోని ఉండగా మోనిత వస్తుంది. ఇక మనుసులో మోనితను చంపేయాలని అనుకుంటాడు. కార్తీక్ దగ్గరికి వచ్చి చెకప్ చేస్తూ ఏం ఆలోచించావ్ అని తన పెళ్లి గురించి టాపిక్ తీయగా కార్తీక్ కూడా గట్టిగా మాట్లాడుతాడు. వెంటనే మోనిత కోపం అవుతూ ఇది ప్రేమ అంటూ తన ప్రేమ గురించి వివరిస్తుంది. కార్తీక్ కూడా మౌనంగా ఉండకుండా మోనిత పై కోపంగా మాట్లాడుతాడు. ఇక మోనిత తన పంతాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా మాట్లాడుతూ తాళిబొట్టు తీసి కట్టు అంటూ.. శిక్ష నుంచి తపిస్తాను అంటూ తాళిబొట్టు చూపిస్తూ పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది.

ఇక బయట దీప వచ్చి ఆనందరావు, సౌందర్య కోసం ఎదురుచూస్తూ కనిపిస్తుంది. ఇక అక్కడికి సౌందర్య మధ్యలో పని ఉండి రాలేకపోయేసరికి ఆనందరావు, ఆదిత్యలు మాత్రం వచ్చేస్తారు. ఇక దీప ఆనందరావు తో కలిసి హాస్పటల్ లోపలికి వెళుతుంది. మరోవైపు మోనిత కార్తీక్ ను తాళికట్టు అంటూ రోషిణి ముందు నిలబడతాను అంటూ కార్తీక్ ను తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంది.అంతలోనే దీప, ఆనందరావు, ఆదిత్య లోపలికి రావడం తో వెంటనే మోనిత ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటిస్తుంది.

ఇది కూడా చదవండి:పెళ్లి చేసుకో కార్తీక్ ఇది ప్రేమ.. ఉన్మాదం కాదంటూ రెచ్చిపోయిన మోనిత.. ఆతర్వాత ఏం జరిగిందంటే?

ఎవరికీ చెప్పొద్దూ అంటూ చెబితే కళ్ళముందే చంపేస్తాను అంటూ కార్తీక్ కు వార్నింగ్ ఇస్తూ కార్తీక్ నోరు మూసేలా చేసింది. ఇతడు ఒక నేరస్తుడు అంటూ కుటుంబ సభ్యులపై ఇలా రావడం సరైనది కాదు అంటూ వారిపై అరుస్తుంది. ఇక కార్తీక్.. మోనితతో తన పెళ్లి ప్రపోజల్ గురించి ఒప్పుకోకపోతే అన్నట్లు మాట్లాడగా మోనిత మళ్ళీ వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడుతుంది.ఇక దీప, ఆనందరావు టెన్షన్ పడుతుంటే.. మోనిత మాటలను గుర్తు చేసుకొని వాళ్లను అక్కడినుంచి పంపే ప్రయత్నం చేస్తాడు కార్తీక్.

ఇది కూడా చదవండి:డాక్టర్ బాబును మంచానికి కట్టేసి మోనిత అరాచకం.. పక్కనే కూర్చొని ఛీఛీ!

మోనిత కూడా వాళ్లను పంపించేస్తుంది. ఇక అందరూ కార్తీక్ ను చూస్తూ ఎమోషనల్ అవుతూ వెళతారు. వెంటనే మోనిత మళ్లీ కార్తీక్ కు పెళ్లి గురించి వార్నింగ్ ఇస్తుంది.ఇంట్లో వాళ్లకు చెప్పేస్తే ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు అంటూ సాఫ్ట్ గా మాట్లాడుతూ అక్కడినుంచి వెళ్లిపోతుంది. బయట ఆనందరావు.. దీపతో రోషిణి ని రిక్వెస్ట్ చేసి మన హాస్పిటల్ లో చేర్పిస్తాం అనేసరికి మోనిత వచ్చి వారిని అడ్డు పడుతుంది. ఇక కార్తీక్ మోనిత మాటలు తలుచుకుంటూ అరుస్తాడు.

First published:

Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Vantalakka

ఉత్తమ కథలు