హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: కొండెక్కిన వంటలక్క ప్రాణం.. గుడిలోనే మోనిత అరాచకం.. అనాథలుగా మారిన డాక్టర్ బాబు పిల్లలు!

Karthika Deepam: కొండెక్కిన వంటలక్క ప్రాణం.. గుడిలోనే మోనిత అరాచకం.. అనాథలుగా మారిన డాక్టర్ బాబు పిల్లలు!

karthika deepam

karthika deepam

Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో రోజు రోజుకి ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు అభిమానులు. పైగా మోనిత ఈసారి వంటలక్కను చంపడానికి ప్లాన్ చేయడంతో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా మారింది.

  Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో రోజు రోజుకి ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు అభిమానులు. పైగా మోనిత ఈసారి వంటలక్కను చంపడానికి ప్లాన్ చేయడంతో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే భాగ్యం, మురళి కృష్ణ గుడిలో సోదమ్మ, పూజారి చెప్పిన పూజ గురించి దీపకు చెప్పడంతో.. ఉదయం నిద్ర లేచిన దీప గుడికి వెళ్లడానికి సిద్ధమవుతోంది. వారణాసిని సిద్ధంగా ఉండమని చెబుతుంది. ఇక మోనిత దీపను చంపడానికి సోదమ్మలా తయారవుతుంది. గన్ ను పట్టుకొని దీపని చంపుతానని నవ్వుకుంటుంది. అంజి, దుర్గ జాగింగ్ చేస్తూ.. దీప, కార్తీక్ ల గురించి మాట్లాడుకుంటారు. మోనితను ఏం చేయవద్దని.. ఎందుకంటే మోనితను ప్రేమిస్తున్నాను అని దుర్గ అంజి తో చెబుతాడు. వెంటనే అంజి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా మోనితను ప్రేమిస్తారా అంటూ దుర్గను తిడతాడు. అలా వాళ్లు మాట్లాడుతున్న సమయంలో దీప కారు వచ్చి వారి ముందు ఆగడంతో.. అంజి, దుర్గ.. ఎక్కడికి వెళ్తున్నావ్ దీపమా అని ప్రశ్నిస్తారు. దీప గుడి లో జరిగే పూజ గురించి వివరిస్తుంది.

  మేము కూడా వస్తాము అనడంతో.. నేను ఒక్కదాన్నే వెళ్లాలంట అని చెబుతుంది. ఏదైనా సహాయం ఉంటే మీకు చెబుతాను అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరోవైపు సౌందర్య దగ్గరికి సౌర్య వచ్చి అమ్మ ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నిస్తుంది. ఇల్లు మొత్తం వెతికిన అమ్మ కనిపించడం లేదు అంటూ ఎక్కడికి వెళ్లింది అంటూ ప్రశ్నలు వేస్తుంది. ఇక సౌందర్య నచ్చజెప్పి అక్కడినుంచి సౌర్య ను పంపిస్తుంది.

  సౌందర్య కూడా దీప ఎక్కడికి వెళ్ళిందో అని ఆలోచనలో పడింది. దీప గుడికి చేరుకోగా.. వెనకాలే మోనిత దీప ను ఫాలో అవుతుంది. ఇక దీపను చూస్తూ కోపంతో రగిలిపోతుంది. దీప వెనుకాలనే ఫాలో అవుతుంది మోనిత. మరోవైపు పూజారులు దీప చేసే హోమం గురించి పూజా ఏర్పాట్లు చేస్తుంటారు. పూజారి దగ్గరికి వెళ్లి దీప పలకరిస్తుంది.

  karthika deepam, monitha, doctor babu, nirupam paritala, karthik, vantalakka, nalla deepa, deepa, premi vishwanath
  karthika deepam

  ఇక పూజారి కూడా దీపతో మాట్లాడుతుండగా.. ఓ వైపు దూరంలో నిల్చొని దీపను గమనిస్తూనే ఉంటుంది. దీపకు గన్ తో గురి పెడుతుంది. దీప పూజలో పాల్గొంటుండగా మోనిత గన్ తో ఒకేసారి షూట్ చేస్తుంది. వెంటనే దీపకు గన్ షూట్ తగిలినట్టుగా కనిపించగా.. వెంటనే స్పృహ కోల్పోతూ కింద పడబోతుంది. ఇదంతా చూస్తే ఈసారి వంటలక్క ప్రాణాలు ఎవరు కాపాడలేరు అన్నట్లుగానే అనిపిస్తుంది. మొత్తానికి గాలిలో వెలుగుతున్న దీపం లా దీప ప్రాణాలు కూడా అలాగే మారింది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Vishwanath, Vantalakka

  ఉత్తమ కథలు