హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: రిజిస్టర్ ఆఫీస్‌లో కార్తీక్, మోనిత పెళ్లి.. సాక్షులుగా వంటలక్క, సౌందర్య?

Karthika Deepam: రిజిస్టర్ ఆఫీస్‌లో కార్తీక్, మోనిత పెళ్లి.. సాక్షులుగా వంటలక్క, సౌందర్య?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారడంతో అభిమానులు టీవీల ముందు వాలిపోతున్నారు. ఏదో ఒక ట్విస్ట్ తో కథ సాగుతున్న తరుణంలో అసలు శుభం కార్డు పలుకుతుందా లేదా అని తెగ ఎదురు చూస్తున్నారు.

  Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారడంతో అభిమానులు టీవీల ముందు వాలిపోతున్నారు. ఏదో ఒక ట్విస్ట్ తో కథ సాగుతున్న తరుణంలో అసలు శుభం కార్డు పలుకుతుందా లేదా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇక కార్తీక్ తన జీవితం గురించి ఇలా ఎందుకు అయ్యిందని కుమిలిపోతాడు. తన కన్న బిడ్డల్ని పరాయి బిడ్డలా, కట్టుకున్న భార్యను కళంకిత గా చూసానని బాధపడుతుంటాడు. ఇప్పుడు దీపని ఎంత ప్రేమగా చూసుకున్నా తనని ఇప్పుడు నమ్మదు అంటూ బాధపడతాడు. ఇక సౌందర్య దగ్గరకి వెళ్లిన పిల్లలు తమ అమ్మానాన్నల పద్ధతి అసలు అర్థం కావట్లేదని బాధపడుతుంటారు. ఇక సౌందర్య పిల్లల మాటలను సరిదిద్దుతూ వారికి నచ్చచెప్పుతుంది.

  ఇక భాగ్యం దీప పరిస్థితి గురించి తెగ ఆలోచిస్తుంది. కార్తీక్ వైద్యం చేస్తూ ఉండగా.. పక్కనే దీప బట్టలు ఆరెస్తూ ఉంటుంది. అంతలోనే వారణాసి కార్తీక్ దగ్గరికి వచ్చి మోనిత వీధి చివర మీకోసం ఎదురు చూస్తోందని అంటాడు. ఇక దీప ఆ మాటలు విని గమనిస్తూ ఉంటుంది. కార్తీక్ కోపంగా పని ఉందని రావడం కుదరదని చెప్పడంతో.. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే గొడవలు అవుతాయని మోనిత చెప్పిందని వారణాసి అంటాడు. దీప ఆ మాటలకు మరింత రగిలిపోతుంది. కార్తీక్ ఏమీ చేయలేక ఆవేశంతో మోనిత దగ్గరికి బయలుదేరుతాడు.

  ఇక దీప కూడా వాళ్లకు కనిపించకుండా ఆటోలో ఉంటుంది. మోనిత, కార్తీక్ లు మాట్లాడేవి గమనిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ మోనిత పై ఆవేశపడతాడు. మోనిత మాత్రం తన మాటలతో ఎంతో జాలి పడేటట్లు మాట్లాడుతుంది. ఇక కార్తీక్.. మోనిత లో మార్పును చూసి ప్రశ్నిస్తాడు. ఏ రోజు తనను ఆసరాగా తీసుకొని తాకానా అంటూ ప్రశ్నిస్తాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ.. ఎప్పుడైనా చనువుగా ప్రవర్తించానా అంటాడు. మన మధ్య జరిగింది నువ్వు వచ్చే చెప్పే వరకు తెలియదని మనసులో మాటను బయట పడతాడు. ఇక దీప ఈ మాటలు వింటూనే ఉంటుంది. మోనిత అంతటితో ఆగక కూల్ చేసే విధంగా మాట్లాడి తనతో కారులో ఎక్కించుకునేలా చేస్తుంది. కార్తీక్ మొత్తానికి మోనిత ప్రయాణంలో ఇరుక్కున్నాడు. ఇక దీప ఉగ్ర రూపంలో మారుతుంది. ఇంటికి వెళ్లి ఆటో కడుగుతూ ఉంటుంది. ఇక వారణాసి ఆపే ప్రయత్నం చేస్తుంటే అతనిపై మరింత కోపం చూపిస్తుంది. ఇక సౌందర్య పిల్లలను తీసుకొని దీప దగ్గరికి బయలు దేరుతుంది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Doctor babu, Karthika deepam, Nirupam paritala, Premi Vishwanath, Telugu daily serial, Vantalakka

  ఉత్తమ కథలు