Karthika Deepam: అంజిని వెతకడానికి వెళ్లిన వంటలక్క.. సూర్యాపేట్ రోడ్డులో మోనితను చూసి?

karthika deepam

Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. రోజు రోజుకి దీప మోనితను ఓ రేంజ్ లో ఆడుకోవడంతో ప్రేక్షకులు కూడా బాగా ఇటువంటి సీన్ లను మిస్ అవ్వట్లేదు. రేటింగ్ కూడా ఓ రేంజ్

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. రోజు రోజుకి దీప మోనితను ఓ రేంజ్ లో ఆడుకోవడంతో ప్రేక్షకులు కూడా బాగా ఇటువంటి సీన్ లను మిస్ అవ్వట్లేదు. రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక కార్తీక్ రోషిణి దగ్గరికి వెళ్లగా రోషిణి సరెండర్ అవ్వడానికి వచ్చారా అంటూ ప్రశ్నిస్తుంది. మోనిత కడుపులో పెరుగుతున్న తప్పుకు మీరే కదా అంటూ అని అనడంతో వెంటనే కార్తీక్ తనది తప్పు లేదంటూ.. మోనితది పైశాచికత్వం రోజురోజుకు పెరిగి పోతుందని అంటాడు. ఇక రోషిణి కూడా తన ప్రశ్నలతో కార్తీక్ ను కడిగి పారేస్తుంది. మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటూ ప్రశ్నిస్తుంది.

    మోనిత ఇంటికి స్నేహం అనే పేరుతో వెళ్లడం అలా చేయడం.. ఆడ మగ స్నేహానికి చిన్న గీత ఉంటుంది. దానికి మీరు ఎటువైపు ఉన్నారు. ఆ సరిహద్దు రేఖను దాటారు అనడంతో వెంటనే కార్తీక్ షట్ అప్ అంటూ సారీ అని చెప్పేస్తాడు. ఇక అంజి గురించి నేను చూసుకుంటాను అని నువ్వెళ్ళి దీపతో, పిల్లలతో సంతోషంగా ఉండు అని పంపిస్తుంది. ఇక ప్రియమణి అంజి గురించి ప్రశ్నిస్తూ.. మీలో నాకు ఏదో తప్పు కనిపిస్తుంది అని గట్టిగా నిలదీస్తుంది. వెంటనే మోనిత ప్రియమణిపై గట్టిగా అరుస్తుంది. ఇక అదేపనిగా ప్రియమణి ప్రశ్నించడంతో మోనిత మాత్రం తెగ ఆవేశ పడుతూ ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ మండిపడుతోంది.

    ఇక ప్రియమణి నేను కూడా మీకు దూరం అవుతాను.. అప్పుడు మిమ్మల్ని చూసి అది కూడా ఉండదు.. గుర్తుపెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక రోషిణి అంజి దొరికాడు అని చెప్పడంతో వెంటనే దీప తన మనసులో.. అంజి గురించి మనసులో అనుకుంటూ కానీ ఆయనకు చెప్పకుండా సూర్యాపేటకు వెళ్ళమని, ఆయనకు ఎందుకు చెప్పొద్దని అనుకుంటుంది. ఇక మోనితకు కూడా అంజి అక్కడే ఉన్నాడని ఫోన్ లో ఎవరో చెబుతారు. సంతోషంగా బయల్దేరుతుంది. ఇక ప్రియమణి కి వెళ్తున్నానని చెబుతూ.. కార్తీక్ ను ప్రేమించడం తప్ప నేనేం చేయలేదు .. మనసులో ఏం పెట్టుకోకు అంటూ వెళ్లిపోతుంది. ఇక దీప కూడా పిన్ని దగ్గర వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరుతుంది.
    Published by:Navya Reddy
    First published: