Karthika Deepam: ఇన్నేళ్లు చెయ్యని తప్పు.. కలుసుకున్నప్పుడే ఎందుకు చేస్తాడు.. ఏసీపీకి వివరించిన వంటలక్క!

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత రసవత్తరంగా మారింది. కథ మొత్తం మళ్లీ యూటర్న్ తీసుకుంది. కార్తీక దీపం సీరియల్ చివరి క్షణాల్లో ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఎదురుచూపులు చూస్తున్నారు.

  • Share this:
    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత రసవత్తరంగా మారింది. కథ మొత్తం మళ్లీ యూటర్న్ తీసుకుంది. కార్తీక దీపం సీరియల్ చివరి క్షణాల్లో ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో దీప దగ్గరికి వెళ్లిన మోనితను.. తన మాటలతో కడిగి పారేస్తుంది. 25న గుండెనొప్పి వస్తే మా ఆయన హాస్పిటల్లో చేరు, పిచ్చెక్కితే మెంటల్ హాస్పిటల్ లో చేరు అంటుంది. మళ్లీ నీ మొగుడు నాకే సొంతం అని మా జోలికి వస్తే శ్రీరామ్ బస్తీ ఆడవాళ్ళు పొలిమేర దాటే వరకు తరిమేస్తారు అంటూ.. అప్పుడు గజగజ వణికి చస్తావని.. గెటవుట్ అంటూ వార్నింగ్ ఇచ్చింది దీప. మళ్ళీ భాగ్యం మోనిత ఇంటికి బ్యాగ్స్ తీసుకొని వెళుతుంది. ఇక ప్రియమణి అడ్డుపడటంతో బయట కూర్చుంటుంది.

    ఆదిత్య..దీపతో అన్నయ్య లో మార్పు వచ్చిందని మాట్లాడుతాడు. మానిత.. ఏసీపీ రోషిణీ ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి చెబుతోంది. ఎలాగైనా న్యాయం చేయాలంటూ, కార్తీక్ తో పెళ్లికి చేయించాలి అంటూ ఏడ్చుకుంటూ వేడుకుంటుంది. దాంతో రోషిణీ న్యాయం జరిగేలా చేస్తానంటూ మోనితను కూల్ చేస్తుంది. ఇక మోనిత.. తన మనసులో దీప కుటుంబం రోడ్డున పడే టైం వచ్చింది అంటూ సంబరపడిపోతుంది. కార్తీక్ పిల్లల్ని తీసుకొని బయలుదేరుతాడు.

    ఇక దీప పిల్లల సంతోషాన్ని గురించి తాము ఇలా ఉన్నామంటూ ఆదిత్యతో చెబుతుంది. అదే సమయంలో దీప ఇంటికి రోషిణీ వస్తుంది. మోనిత.. కార్తీక్ ను అన్యాయం చేశాడని, అంతేకాకుండా మీ కుటుంబం మొత్తం వ్యతిరేకంగా మారిందని న్యాయం కోసం వచ్చింది అని తెలుపుతుంది. ఇక దీప కూడా న్యాయం చెయ్యండి.. న్యాయమే చెయ్యండి.. మేము కోరుకునేది కూడా అదే అంటుంది దీప. ఇక రోషిణీ అదేంటి అని ప్రశ్నించగా.. దీపా రోషిణీ కి అర్థమయ్యేలా జరిగినదంతా చెబుతుంది. మరి రోషిణీ ఎవరికీ న్యాయం చేస్తుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published: