హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: దీప ఆరోగ్యంపై దిగులు పెట్టుకున్న అత్తామామ.. వంటలక్క చివరికి పిచ్చిదవుతుందా?

Karthika Deepam: దీప ఆరోగ్యంపై దిగులు పెట్టుకున్న అత్తామామ.. వంటలక్క చివరికి పిచ్చిదవుతుందా?

అయితే ఈ సీరియల్ క్లైమాక్స్ మాత్రం ముందుగానే లీక్ అయిపోయింది. ఇప్పటికే మలయాళంలో ఈ సీరియల్ అయిపోయింది. దాంతో అక్కడి క్లైమాక్స్‌నే ఇక్కడ కూడా షూట్ చేస్తారని తెలుస్తుంది. క్లైమాక్స్‌లో తనకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని తెలుసుకుని.. తన భార్య దీపని క్షమించమని కోరడానికి డాక్టర్ బాబు వెళ్తాడు.

అయితే ఈ సీరియల్ క్లైమాక్స్ మాత్రం ముందుగానే లీక్ అయిపోయింది. ఇప్పటికే మలయాళంలో ఈ సీరియల్ అయిపోయింది. దాంతో అక్కడి క్లైమాక్స్‌నే ఇక్కడ కూడా షూట్ చేస్తారని తెలుస్తుంది. క్లైమాక్స్‌లో తనకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని తెలుసుకుని.. తన భార్య దీపని క్షమించమని కోరడానికి డాక్టర్ బాబు వెళ్తాడు.

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయమే. ఇక ఈ సీరియల్ రోజు రోజుకు కొత్త కొత్త ట్విస్ట్ లతో ప్రసారమవ్వగా

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయమే. ఇక ఈ సీరియల్ రోజు రోజుకు కొత్త కొత్త ట్విస్ట్ లతో ప్రసారమవ్వగా.. తాజాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. ఈరోజుకి 1022 ఎపిసోడ్ కు ఎంట్రీ ఇవ్వగా.. గత ఎపిసోడ్ లో కార్తీక్ తాగొచ్చి కాసేపు వాళ్ళతో గడుపుతాడు. సౌర్య, కార్తీక్ తో తాతయ్య ఇంటికి వెళ్లడానికి వెళ్దామని బతిమాలుతుంది. ఇక అలా కొద్దిసేపు తమ ప్రయాణాన్ని గురించి మాట్లాడుతూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. ఇక దీప కార్తీక్ విషయంలో పిల్లలు మాట్లాడిన మాటల గురించి ఆలోచనలో పడుతుంది. అంతేకాకుండా కార్తీక్ కూడా అదే ఆలోచనలో ఉంటాడు.


ఇక తెల్లారాక భాగ్యం ఇంట్లో పండగ హడావుడి మదర్ అవుతుంది. భాగ్యం తయారయ్యి మురళీకృష్ణ దగ్గర వచ్చి కాసేపు తన అందం గురించి అడుగుతూ కామెడీ అందిస్తుంది. ఇక మోనిత విషయానికి వస్తే.. మోనిక తన ఫ్రెండ్ తో ఫోన్ లో తప్పకుండా వస్తాను అంటూ అంతేకాకుండా నా కార్తీక్ని పిలిచావా అంటూ.. ఇంకేంటి ఇద్దరం కలిసి వస్తామని తన స్నేహితురాలికి మాట ఇస్తుంది. ఇక ఇది విన్న ప్రేమని మనసులో కొన్ని సామెతలు అనుకుంటుంది.


ఇక దీప సాదాసీదా చీరతో రెడీ అవ్వగా సౌందర్య పట్టు చీర కట్టుకోమంటుంది. ఇక అవన్నీ ఇష్టం లేదు అత్తయ్య అని చెబుతూ.. మీ అబ్బాయి నాకు సాదాసీదా చీరైనా కొని పెట్టొచ్చు కదా అని జాలితో సౌందర్యతో అంటుంది. ఇక ఇద్దరు పిల్లలు బాగా రెడీ అయ్యి వాళ్ల ముందుకి రాగా.. నాన్నను రిక్వెస్ట్ చేసి దీపని అడగమంటారు. ఇక దీప కార్తీక్ రూమ్ లోకి వెళ్ళగా.‌. గాఢనిద్రలో ఉంటాడు కార్తీక్. ఇక అతన్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్తున్న సమయంలో మోనిత నుండి ఫోన్ వస్తుంది. ఇక కార్తీక్ ని లేపుతూ కోపంగా ఫోన్ చేతిలో పెడుతుంది.


ఇక కార్తీక్ ని రెడీ అయి ఉన్నాను బయల్దేరి రామా అంటూ అనగా వెంటనే కార్తీక్ దీప తో పాటు ఇంటికి వెళ్తున్నాను అని అంటాడు. ఈ మాట విని మోనిత షాక్ అవుతుంది. ఇక కమింగ్ అప్ లో మోనితను కూడా భాగ్యం ఇంటికి ఆహ్వానిస్తాడు. మరి మోనిత చివరికి స్నేహితురాలి పిలిచిన ఆహ్వానానికి వెళుతుందా లేదా భాగ్యం ఇంటికి వెళుతుందా అనేది చూడాలి. కాగా కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క చివరికి పిచ్చిదవుతుందని.. కార్తీక్ అమెరికా వెళ్ళిపోతాడు అని ఎప్పటి నుంచో గుస గుసలు వినిపిస్తున్నాయ్. మరి వంటలక్క నిజంగానే చివరికి పిచ్చిది అవుతుంది ఏమో చూడాలి.

First published:

Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka

ఉత్తమ కథలు