నీ మొగుడు తాగుబోతు.. పిల్లల్ని వదిలేయ్.. వనిత విజయ్ కుమార్ ఫైర్..

Vanitha Vijaykumar: తమిళ నటి వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ పెళ్లి జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ వివాదాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పీటర్ మొదటి భార్య ఎలిజిబిత్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 4, 2020, 10:55 PM IST
నీ మొగుడు తాగుబోతు.. పిల్లల్ని వదిలేయ్.. వనిత విజయ్ కుమార్ ఫైర్..
విజయ్ కుమార్ కూతురు వనిత (Twitter/Photo)
  • Share this:
తమిళ నటి వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ పెళ్లి జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ వివాదాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పీటర్ మొదటి భార్య ఎలిజిబిత్ తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడని ఆయనపై పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై వనిత కూడా చాలా సీరియస్ అయిపోయింది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే మొగుడు గుర్తొచ్చాడా అంటూ మండి పడింది. కేవలం డబ్బులు గుంజడానికి ఈమె ఆడుతున్న డ్రామా అంటూ ఫైర్ అయింది వనిత విజయ్ కుమార్. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వివాదం కూడా చోటు చేసుకుంది.


తమిళ సీనియర్ నటి లక్ష్మీ రామకృష్ణన్ కూడా వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లిపై కొన్ని వివాదాస్పద కమెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే వనిత కూడా ఈమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నటి కుట్టి పద్మిని కూడా వనితకు కొన్ని సలహాలు ఇచ్చింది. ప్రస్తుతం వనిత విజయ్ కుమార్, కుట్టి పద్మిన మధ్య వివాదం సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరిపోయింది. వనితా విజయ్ కుమార్ మూడో భర్త పీటర్ పాల్ గురించి కుట్టి పద్మిని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేసింది.

పీటర్ పాల్ వ్యక్తిగత జీవితంతో పాటు అతడి మద్యం అలవాట్ల గురించి.. ఇతర మహిళలతో ఉన్న అక్రమ సంబంధాలపై కూడా ఆమె ఓపెన్ కామెంట్స్ చేసింది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చాలా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. దాంతో కొందరు సినీ ప్రముఖులు కూడా వనితను హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే కుట్టి పద్మిని కూడా ఇలాంటి కామెంట్స్ చేసింది. పీటర్ పాల్ వ్యక్తిగత అలవాట్లపై విమర్శలు వస్తుండటంతో మీ ఇద్దరు అమ్మాయిలను హాస్టల్‌లో చేర్పించండి.. తాగుడు అలవాటు ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం పిల్లలకు చాలా కష్టం అవుతుందంటూ వనితకు సలహా ఇచ్చింది కుట్టి పద్మిని.

దానిపై వనిత మండిపడింది. అస్సలు మీ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదని చెప్పింది. నువ్వన్న మాటలకు నేను చాలా హర్ట్ అయ్యాను.. ఏదైనా కూడా నాకు పర్సనల్‌గా చెప్పాలి కానీ సోషల్ మీడియాలో కాదు.. అయినా నా వ్యక్తిగత జీవితం గురించి నీకెందుకు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది వనిత. దీనిపై వెంటనే మళ్లీ కుట్టి పద్మిని కూడా వివరణ ఇచ్చింది.తన ఉద్దేశ్యం అది కాదని.. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు సారీ వనిత అంటూ ట్వీట్ చేసింది. దాంతో కుట్టి పద్మిని క్షమాపణపై వనితా విజయ్ కుమార్ స్పందిస్తూ.. మీరు క్షమాపణలు చెప్పినందుకు థాంక్యూ చెబుతున్నట్లు చెప్పుకొచ్చింది.

తనకు తన పిల్లలు అంటే ప్రాణమని.. వాళ్లను హాస్టల్‌లో వదిలేయాలంటూ ఎలా చెప్తారంటూ చెప్పుకొచ్చింది వనిత. వాళ్లే తన జీవితం అంటుంది వనిత. మీరలా చెప్తారని ఊహించలేదని.. మీ ఛానెల్‌లో సినీ ప్రముఖుల చేత ఇలాంటి గాసిప్స్ చెప్పించకండంటూ మండిపడింది. మొత్తానికి ఇప్పుడు కుట్టి పద్మిని వర్సెస్ వనిత వార్‌పై మంచి ఆసక్తి నెలకొంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 4, 2020, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading