హోమ్ /వార్తలు /సినిమా /

Vanitha Vijaykumar : చిరంజీవి ఫ్యామిలీతో వనిత విజయకుమార్ అనుబంధం.. ఆలీతో సరదగా సంచలన వ్యాఖ్యలు..

Vanitha Vijaykumar : చిరంజీవి ఫ్యామిలీతో వనిత విజయకుమార్ అనుబంధం.. ఆలీతో సరదగా సంచలన వ్యాఖ్యలు..

వనిత విజయ్ కుమార్, చిరంజీవి (Twitter/Photo)

వనిత విజయ్ కుమార్, చిరంజీవి (Twitter/Photo)

Vanitha Vijaykumar - Chiranjeevi: చిరంజీవి ఫ్యామిలీతో వనిత విజయకుమార్ తమకున్న  అనుబంధం ఏమిటో.. ఆలీతో సరదగా  ఇంటర్య్యూలో  వెల్లడించారు.

Vanitha Vijaykumar : చిరంజీవి ఫ్యామిలీతో వనిత విజయకుమార్ తమకున్న  అనుబంధం ఏమిటో.. ఆలీతో సరదగా  ఇంటర్య్యూలో  వెల్లడించారు. వనితా విజయ్‌కుమార్ ఆలీతో సరదగా కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వనిత విజయ్ కుమార్ విషయానికొస్తే.. ఈమె తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్‌గా ఒక వెలిగిన మంజుల కూతురు. ఈమె తండ్రి విజయ్ కుమార్ కూడా తమిళంలో ఒకపుడు అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా దక్షిణాది ఇండస్ట్రీలో ఇప్పటికే నటిస్తున్నారు. సినీ నటి వనిత విజయ్ కుమార్ పరిచయం గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఈమె కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ఇక తన పరిచయాన్ని ఎక్కువగా నటిగా కాకుండా వ్యక్తిగత విషయంలో పెంచుకుంది వనిత. ఇప్పటికే మూడు పెళ్లిళ్ల తో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తమిళ పవర్ స్టార్ ‌ను పెళ్లి చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

Vanitha Vijaykumar and Megastar Chiranjeevi Do You Know Relation Between Vanitha And Chiranjeevi Family Here Are The Details Vanitha Vijaykumar : చిరంజీవితో వనిత విజయకుమార్ ఫ్యామిలీకున్న ఈ సంబంధం తెలుసా..,Vanitha Vijaykumar, Vanitha Vijaykumar Interview,Vanitha Vanitha Vijaykumar Chiranjeevi Family,vanitha vijaykumar, Tollywood, Alitho saradaga show, comedian ali, alitho saradaga promo, Tollywood, devi heroine,Tollywood,Kollywood,వనిత విజయ్ కుమార్,వనిత విజయ్ కుమార్ ఇంటర్వ్యూ,వనిత విజయ్ కుమార్ ఆలీతో సరదగా,వనిత విజయ్ కుమార్ చిరంజీవి
వనిత విజయ్ కుమార్, చిరంజీవి (Twitter/Photo)

ఈమె విజయ్ కుమార్, నటి మంజుల పెద్ద కూతురు. ఇక వీళ్ల తల్లిదండ్రలు పెళ్లి తర్వాత మూడేళ్లకు పిల్లలు కలగకపోవడంతో వాళ్ల ఇంటికి దగ్గరలో ఉన్న మరో ఇంట్లో పాముల పుట్ట ఉండేదట. వాళ్ల అమ్మవాళ్లకు ఎవరో చెప్పారట. అక్కడే వుండే కొంత మంది అక్కడే పుట్టలో కొలువైన నాగ దేవతకు ఎన్నో అద్భుత శక్తులున్నాయని.. మొక్కుకుంటే వాళ్ల కోరిక తప్పక తీరుతుందని కూడా చెప్పారట. దీంతో వనిత వాళ్ల అమ్మ మంజుల ఆ పుట్టలోని నాగదేవతకు మొక్కుకున్నారట. అంతేకాదు పిల్లలు పుడితే.. ఓ గుడి కూడా కట్టిస్తానని కూడా ఆ మొక్కులో ఉందట. ఆ తర్వాత మంజుల, విజయ్ కుమార్ దంపతులకు మొదటి సంతానంగా వనిత పుట్టారు. ఆ తర్వాత మరో ఇద్దరు పుట్టారు. ఇక వనిత తల్లి మంజుల మొక్కుకున్న నాగుపాము పుట్ట ఉన్నది ఎవరింట్లో కాదు. చిరంజీవి గారి ఇంట్లో. ఆ రకంగా చెన్నైలో ఉన్న చిరంజీవి ఇంట్లో ఉన్న నాగ దేవతను మొక్కున్న తర్వాత తాను పుట్టానని చెప్పారు. మరోవైపు వనిత ఫ్యామిలీకి మోహన్ బాబు పిల్లలు మంచు విష్ణు, మనోజ్, రవిరాజా పినిశెట్టి పిల్లలు అందరం ఎంతో అల్లరి చేసేవారమంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి.. 

Mohan Babu: ఆ వ్యక్తి నన్ను దారుణంగా మోసం చేసారు.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..


Tollywood Family Multistarers: టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్.. మెగా, నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కినేని, దగ్గుబాటి వరకు..


Chiranjeevi : చిరంజీవి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా.. దీని వెనక ఇంత పెద్ద కహానీ ఉందా..


HBDShankar: దక్షిణాది చిత్రాల సత్తాను చూపెట్టిన ఇస్మార్ట్ డైరెక్టర్ శంకర్..

HBD Nidhhi Agerwal : హ్యాపీ బర్త్ డే గోల్డెన్ స్టార్ నిధి అగర్వాల్.. ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..


నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు

First published:

Tags: Alitho Saradaga, Chiranjeevi, Kollywood, Tollywood, Vanitha Vijaykumar

ఉత్తమ కథలు