హోమ్ /వార్తలు /సినిమా /

Vanitha Vijaykumar: పవర్ స్టార్‌తో వనితా విజయ్ కుమార్ పెళ్లి.. వైరల్ అవుతోన్న పిక్..

Vanitha Vijaykumar: పవర్ స్టార్‌తో వనితా విజయ్ కుమార్ పెళ్లి.. వైరల్ అవుతోన్న పిక్..

Vanitha Vijaykumar

Vanitha Vijaykumar

Vanitha Vijaykumar: వనితా విజయ్ కుమార్.. నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వనిత ప్రేమ..పెళ్ళిళ్లు.. విడాకులు ఇలా ఏదో ఒక వార్తతో వార్తల్లో ఉంటుంది.

  వనితా విజయ్ కుమార్.. నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వనిత ప్రేమ..పెళ్ళిళ్లు.. విడాకులు ఇలా ఏదో ఒక వార్తతో వార్తల్లో ఉంటుంది. వనిత ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె ప్ర‌ముఖ సినీ సెలెబ్రీటీస్ విజ‌య్ కుమార్, మంజుల పెద్ద కుమార్తె. ఈమె సినిమాల్లో కంటే కూడా రోజు ఏదో ఒక వివాదంతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ‌, పెళ్లిళ్ల విష‌యంలో ఆమె విమర్శలను ఎదుర్కోంటూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వనిత ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విమర్శల పాలైయారు. ఇక తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో పవర్ స్టార్‌తో పెళ్లి ఫోటోను పంచుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. అయితే ఆమె పోస్ట్ చేసింది తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో.. తమిళ కమెడియన్ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో దండలు మార్చుకొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇదంతా ఆమె నటిస్తున్న ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిందని అంటున్నారు. ఆమె ప్రస్తుతం 'వాసువిన్ 4 కార్పినిగల్' తో సహా పలు సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలో వనితా.. అనికా, సీత, కృషిక, లీనా కుమార్, నీయా నానా గోపిలతో కలిసి నటిస్తోంది. ఈ సినిమాకు మణి నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'మాస్టర్' ఫేమ్ జేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్నారు.


  ఇక వనితా గతంల టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌పై చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తనకు లైన్ వేసేవాడని.. చిరంజీవి నటించే ఓ ఇంగ్లీష్ సినిమా ఓపెనింగ్ కి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న అల్లు అర్జున్ సూపర్ స్టైలీష్‌గా తయారై తన వైపు చూస్తు.. తనకు లైన్ వేశాడని తెలిపింది. అతను నాకన్న చిన్నవాడు అయినా కూడా అలా నావైపు చూసాడని తెలిపింది. బన్ని సూపర్ డ్యాన్సర్‌ అని.. తనతో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని.. అల్లు అర్జున్‌కు అత్తగా నటించాలనీ ఉందనీ.. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్ అని.. అతనితో యాక్ట్ చేయాలనీ అనుకుంటున్నాని తెలిపింది.

  ఇక వనితా విజయ్‌కుమార్.. కెరీర్ గురించి మాట్లాడితే.. 1995లో ‘చంద్రలేఖ’ అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో దలపతి విజయ్‌కు జోడిగా నటించింది. ఆ తర్వాత తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రంలో కీ రోల్ పోషించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు రియాలిటీ షోల్లోను పాల్గోంటూ సూపర్ బిజీగా ఉంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Tollywood news

  ఉత్తమ కథలు