Nayanthara : వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లైంది.. నయనతార పరిస్థితి...

Nayanthara : తమిళ సీనియర్ నటుడు విజయకుమార్ మంజుల దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్నసంగతి తెలిసిందే..

news18-telugu
Updated: July 23, 2020, 2:04 PM IST
Nayanthara : వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లైంది.. నయనతార పరిస్థితి...
వనిత విజయ్ కుమార్, ప్రియుడితో నయనతార Photo : Twitter
  • Share this:
తమిళ సీనియర్ నటుడు విజయకుమార్ మంజుల దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్ ఇటీవల తరుచూ ఏవో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. వనితా సినీ నటి మాత్రమే కాకుండా బిగ్ బాస్ సీజన్ 3లో కూడా పాల్గొని అక్కడ అదరగొట్టింది. అయితే, ఈమె ఇటీవల మూడో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలతో పాటు.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తన కుమార్తెల సమ్మతంతోనే మూడో పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించింది వనిత. అయితే, ఈ పెళ్లిపై కోలీవుడ్‌లో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని కేంద్రంగా చేసుకుని సోషల్ మీడియాలో అనేక మంది ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే  సోషల్ మీడియాలో తనపై వస్తోన్న విమర్శలకు వనిత ఆ సోషల్ మీడియా ద్వారానే బదులు చెబుతూ.. మధ్యలో సినీ నటి నయనతార వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించింది.


ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు, నటుడు ప్రభుదేవా కూడా గతంలో తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నయన తారతో సహజీవనం చేశాడని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ సందర్భంగా నయనతార, ప్రభుదేవాల గురించి ప్రస్తావించిన వనీత.. ఈ ఇద్దరి కారణంగగా ప్రభుదేవా భార్య రమాలతతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు ఎన్నో కష్టాలు అనుభవించారని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయంపై అప్పట్లో ఎవరూ ఒక్క మాట మట్లాడలేదని.. ఇప్పుడు మాత్రం తన మూడో పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారని వాపోయింది. అసలు నువ్వు నీ గురించి మాట్లాడుకోవాల్సింది పోయి.. మా అభిమాన నటి గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఆమెపై నయనతార ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇక ఆ తాకిడి తట్టుకోలేక వనిత చివరకు తన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: July 23, 2020, 2:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading