Varsha Viswanath : రెండో షెడ్యూల్‌లో వాణీ విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ కూతురు కొత్త మూవీ..

వర్ష విశ్వనాథ్, రాజీవ్ సాలూరి (Twitter/Photo)

Varsha Viswanath | ఒకప్పటి తెలుగు గ్లామర్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ (Vani Viswanath) కూతురు వర్ష విశ్వనాథ్ (Varsha Viswanath) టాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా పరిచయం అవుతోంది. ఈమె హీరోయిన్‌గా పరిచయమవుతున్న సినిమా రెండో షెడ్యూల్ రీసెంట్‌గా మొదలైంది.

  • Share this:
    Varsha Viswanath | ఒకప్పటి తెలుగు గ్లామర్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ (Vani Viswanath) కూతురు వర్ష విశ్వనాథ్ (Varsha Viswanath) టాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా పరిచయం అవుతోంది. ఈమె హీరోయిన్‌గా రాజీవ్ సాలూరు (Rajeev Saluri) హీరోగా టైగర్ హిల్స్  ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాత గా, కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రొడక్షన్ నెంబర్ 1' చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే వైజాగ్ లో ప్రారంభం అయ్యింది. మణిశర్మ (Mani Sharma) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ కె అచల మాటలందిస్తున్న ఈ సినిమా లో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (Koti) సాలూర్ ఓ ముఖ్య పాత్ర లో నటిస్తుండగా సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోస్తిస్తున్నారు.

    విష్ణుసూర్య గుంత ఎక్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్ లో అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ చేస్తున్నారు.ఈ సందర్భంగా  చిత్ర నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి) మాట్లాడుతూ.. మా సంస్థ‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ కి మొదలుపెట్టుకుంది.

    NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

    మొదటి షెడ్యూల్ షూటింగ్ అనుకున్న విధంగా బాగా జరిగింది... దర్శకుడు మా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. హీరో హీరోయిన్స్ రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా కుదిరిందన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ గారు సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కోటి గారు నటించడం విశేషం అన్నారు.

    Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

    దర్శకుడు కిట్టు నల్లూరి మాట్లాడుతూ.. ఈ సినిమా ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఎంతో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిస్తున్నట్టు వివరించారు. ప్రేక్షకులకు నచ్చే ప్రతి అంశం ఈ చిత్రం లో ఉంటుందన్నారు. రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్‌లు ఈ సినిమాలో పోటాపోటీగా నటించినట్టు చెప్పారు.

    బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

    నన్ను నమ్మి దర్శకుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గాజుల వీరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు. తప్పకుండా ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెస్తుందన్నారు.  మణిశర్మ గారి సంగీతం చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.. అన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: