హోమ్ /వార్తలు /సినిమా /

Vani Jairam Death: రక్తపు మడుగులో గాయని వాణీ జయరాం.. ఆమె మృతిపై అనుమానాలు..

Vani Jairam Death: రక్తపు మడుగులో గాయని వాణీ జయరాం.. ఆమె మృతిపై అనుమానాలు..

రక్తపు మడుగులో వాణీ జయరాం (twitter/Pjhoto)

రక్తపు మడుగులో వాణీ జయరాం (twitter/Pjhoto)

Vani Jairam Suspecious Death:  ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో  కన్నుమూసారు. ఆమె ఇంట్లో రక్తపు మడుగులో పడివుండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Vani Jairam Suspecious Death:  ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో  కన్నుమూసారు. ఇటీవలె కేంద్రం ఆమెకు కేంద్రం మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌తో గౌరవించింది. ఆ అవార్డు స్వీకరించక ముందే.. వాణీ జయరామ్ కన్నమూయడం విషాదకరం. ఐతే.. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐతే ఇంట్లో పనిమనిషి  వచ్చి డోర్ తెరకవపోవడంతో సమీపంలోని వ్యక్తుల మరియు పోలీసుల సహాయంతో డోర్లు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఇంట్లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో ఉందటంతో హుటాహుటిన సమీపంలో హస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.  ఆమెను ఎవరైన హత్య చేసి ఉంటారా.. లేకపోతే కింద పడి చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఆమె నుదురు తలపై ఎవరో బలంగా కొట్టినట్టు గాయాలున్నాయి. ఇక  గాయని వాణీ జయరాం అనుమానాస్పద మృతి అంటూ పోలీసులు కేసు నమోదు చేసారు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 78 యేళ్లు. ఆమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వాణీ జయరామ్  విషయానికొస్త్తే..  అటు దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీ భాషల్లో తన సుమధుర గానంతో అలరించింది. ఉత్తమ గాయనీగా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు.  ఆమె సినీ ప్రస్థానం విషయానికొస్తే.. తెలుగు పాటకు పల్లకీ ఆమె గాత్రం... ఆమె గాత్రంలో అందమైన, అద్భుతమైన పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయి...ఆమె పాట సమ్మోహన పరుస్తుంది..పరవశింపచేస్తుంది..ఒక్కసారి వింటే తృప్తి కలగదు..మళ్లీ మళ్లీ అదే పాట వినాలనిపిస్తుంది...కోయిల కూసినట్టు, గలగలా గోదారి పరుగులు పెట్టినట్టు, గంగమ్మ ఉరకలెత్తి వచ్చినట్టు...ఆమె పాట అనేక భావాలను మోసుకొస్తుంది...తన గానమృతంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన గాత్రం వాణీ జయరాం సొంతం. వాణీ జయరాం తెలుగు సహా దాదాపు 19 భాషల్లో పాటలు పాడారు.

Vani Jairam: పద్మభూషణ్ గ్రహీత గాయనీ వాణీ జయరామ్‌కు పేరు తీసుకొచ్చిన చిత్రాలు ఇవే..

1945 నవంబర్ 30న తమిళనాడులో వెల్లూరులో పుట్టిన వాణీజయరాం తల్లిద్వారా తెలుగు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు ‘కలైవాణి’. ఆరుగురు అక్కా చెల్లెలో ఆమె ఐదో సంతానం. తన ఎనిమిద ఏటనే సంగీత కచేరి నిర్వహించిన వాణీజయరాం. ముత్తస్వామి దీక్షితుల కీర్తనల ఆలాపనలో బాగా పాపులర్ అయింది. వాణీ   సాహిత్యంలోని లాలిత్యాన్ని,పా టలోని భావాన్ని ఒడిసిపట్టి అలవోకగా ఆలపించడం వాణీ జయరాం సొంతం. వాణీ జయరాం తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు..ఆమె కర్నూలులో పుట్టి పెరిగారు.

Balakrishna Vs Chiranjeevi: 2023 సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి Vs వాల్తేరు వీరయ్య.. చిరు, బాలయ్యలలో ఎవరిది పై చేయి..

ఆ కారణంగానే వాణీ జయరాంకు తెలుగుమీద మంచి పట్టు వచ్చింది. అంతేకాదు సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడం వల్ల చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తీ ఏర్పడింది.  ఎనిమిదవ ఏటనే ఆలిండియా రేడియోలో పాట పాడి అబ్బుర పరిచిన బాలమేధావి. 1970లో మొదటి సారిగా సినిమాల్లో ప్లేబాక్ సింగర్ గా అరంగేట్రం చేశారు. గుడ్డి సినిమాలో పాడిన ‘బోల్ రే పపీ హరా‘ వాణీ జయరాం పాడిన మొదటి సినిమా పాట. ఈ పాటకు లయన్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రామిసింగ్ సింగర్, తాన్ సేన్ అవార్డులాంటి ఐదు అవార్డులు అందుకున్నారు.

First published:

Tags: Tollywood, Vani Jairam

ఉత్తమ కథలు