హోమ్ /వార్తలు /సినిమా /

స్టార్ డైరెక్టర్ చూపు డిజిటల్ వైపు.. కారణం అదేనా..

స్టార్ డైరెక్టర్ చూపు డిజిటల్ వైపు.. కారణం అదేనా..

వంశీ పైడిపల్లి: 6 కోట్లు (మినిమమ్ గ్యారెంటీ దర్శకుడిగా పేరున్న ఈయన కూడా రీజనబుల్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు..)

వంశీ పైడిపల్లి: 6 కోట్లు (మినిమమ్ గ్యారెంటీ దర్శకుడిగా పేరున్న ఈయన కూడా రీజనబుల్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు..)

వంశీ పైడిపల్లి మహేష్‌తో ‘మహర్షి’ వంటీ బ్లాక్ బస్టర్ తీశాడు. ఆ సినిమా తర్వాత ఆయన మరో సినిమాను కూడా మహేష్‌తోనే చేయాల్సీ ఉంది.

వంశీ పైడిపల్లి మహేష్‌తో ‘మహర్షి’ వంటీ బ్లాక్ బస్టర్ తీశాడు. ఆ సినిమా తర్వాత ఆయన మరో సినిమాను కూడా మహేష్‌తోనే చేయాల్సీ ఉంది. అయితే వంశీ పైడిపల్లి చెప్పిన మాఫియా బ్యాగ్రౌండ్ కథ మహేష్ బాబుకు నచ్చలేదని, అందుకే ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. మహేష్ మాత్రం సరిలేరు నీకెవ్వరు తర్వాత తన చిత్రాన్ని తాజాగా పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించాడు. మరోవైపు వంశీ కూడా ఆ తరువాత తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గాని, ప్రభాస్ తో గాని ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. కానీ వీటి గురించి అధికారికంగా ప్రకటించలేదు. అది అలా ఉంటే.. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి రాబోయే రోజుల్లో రెండు వెబ్ సిరీస్‌ లు చేయడానికి ఓకే చెప్పాడట. అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రెండు వెబ్ సిరీస్‌లు రానున్నాయని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లు తర్వాత బహుశా వంశీ తన సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మహేష్‌తో చేయాల్సీన సినిమా పూర్తిగా క్యాన్సల్ కాలేదని.. స్కిప్ట్ పనులు జరుగుతున్నాయని టాక్.

First published:

Tags: Mahesh babu, Tollywood, Vamsi paidipally