వాల్మీకి సాంగ్ విడుదల.. ఎల్లువొచ్చి గోదారమ్మా ప్రోమో అదుర్స్..

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం వాల్మీకి. ఈ సినిమాలో అథర్వా మురళి మరో హీరోగా నటించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2019, 10:48 PM IST
వాల్మీకి సాంగ్ విడుదల.. ఎల్లువొచ్చి గోదారమ్మా ప్రోమో అదుర్స్..
వాల్మీకి సాంగ్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2019, 10:48 PM IST
వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం వాల్మీకి. ఈ సినిమాలో అథర్వా మురళి మరో హీరోగా నటించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ఇందులో శోభన్ బాబు ఎవర్‌గ్రీన్‌ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్‌ చేశారు. ఇప్పటికే దీని మేకింగ్ వీడియో కూడా విడుదలైంది. ఇక ఇఫ్పుడు ప్రోమో సాంగ్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మీరు ఎంతైనా ఊహించుకుని రండి.. వాటిని అందుకుంటాం అంటూ దర్శకుడు హరీష్ చాలా ధీమాగా చెప్పాడు. ఇప్పుడు విడుదలైన ప్రోమో చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. రిస్క్ తీసుకోకుండా ఉన్నదున్నట్లు తీసాడు దర్శకుడు.

శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేసాడు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన దేవత సినిమాలోని పాట ఇది. ఇప్పటికీ ఎల్లువొచ్చి గోదారమ్మ పాట అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది. శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కచ్చితంగా రేపు థియేటర్స్‌లో ఈ పాట సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నాడు హరీష్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది వాల్మీకి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమిళ బ్లాక్ బస్టర్ జిగర్తాండకి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు హరీష్ శంకర్.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...