Valmiki: వాల్మీకి సినిమా పేరు మారింది.. కొత్త టైటిల్ ఇదే

అనుకున్నదే జరిగింది. 'వాల్మీకి' చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. పలు జిల్లాల్లో వాల్మీకి చిత్రాన్ని నిలిపివేయాలని కలెక్టర్లు ఆదేశించడంతో ఎట్టకేలకు చిత్ర నిర్మాతలు దిగొచ్చారు. 'వాల్మీకి' సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా టైటిల్‌ను 'గద్దలకొండ గణేష్‌'గా మార్చేశారు.

news18-telugu
Updated: September 19, 2019, 9:29 PM IST
Valmiki: వాల్మీకి సినిమా పేరు మారింది.. కొత్త టైటిల్ ఇదే
వాల్మీకి మూవీ పోస్టర్
  • Share this:
అనుకున్నదే జరిగింది. 'వాల్మీకి' చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు మరిన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దాంతో ఎట్టకేలకు వాల్మీకి చిత్ర నిర్మాతలు దిగొచ్చారు. సినిమా టైటిల్‌ను 'గద్దలకొండ గణేష్‌'గా మార్చేశారు. వాల్మీకి సినిమాకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లోని వాల్మీకి సంఘాలు కొన్ని రోజలుగా ఆందోళన చేస్తున్నాయి. టైటిల్‌ను మార్చాలని లేకుంటే థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించాయి. అంతేకాదు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య సైతం సినిమా పేరును మార్చాలని డిమాండ్ చేశారు.

వాల్మీకి సంఘాల ఆందోళన నేపథ్యంలో పలు జిల్లాల్లో వాల్మీకి చిత్రాన్ని నిలిపివేశారు. కర్నూల్, అనంతపురం జిల్లాల్లో సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ యాజమాన్యాలను కలెక్టర్లు ఆదేశించారు. అలా జరిగితే సినిమాకు ఇబ్బందులు కల్గుతాయని భావించిన 14 రీల్స్ నిర్మాణ సంస్థ దిగొచ్చింది. సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందు వాల్మీకి టైటిల్‌ను మార్చేసింది.


కాగా, 2014లో వచ్చిన తమిళ్ మూవీ 'జిగర్ తాండా'కు రీమేక్‌గా వాల్మీకిని నిర్మించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అతర్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలో గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ కనిపించబోతున్నాడు. నితిన్ గెస్ట్‌రోల్‌లో మెరవబోతున్నాడు. వరుణ్ వెరైటీ గెటప్‌‌తో పాటు ట్రైలర్ రిలీజ్ తర్వాత వాల్మీకి మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

First published: September 19, 2019, 9:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading