మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే చెప్పొచ్చు. మాములు పబ్లిక్కు వీళ్లకు తేడా ఏమిటంటే వాళ్లు చూపులు కలిసిన తర్వాత పెళ్లి పీఠలెక్కుతారు. కానీ వీళ్లు మాత్రం మనసులు కలిసాకా ఒకింటివాళ్లు అవుతున్నారు. అలా పెళ్లిచేసుకున్న బాలీవుడ్ సినీ జంటలపై న్యూస్ 18స్పెషల్ ఫోకస్...
సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంలో కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో కూడా పీపీ..డుండుం...అనేస్తున్నారు. పెళ్లి సందడి చేస్తున్నారు. దీనికి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడాలేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో ఉన్న హీరో, హీరోయిన్లు ఎప్పుడో అపుడు నిజజీవితంలో తలంబ్రాలు పోసుకుంటూ మాంగల్యం తంతునానేనా అనిపించుకుంటున్నారు.
గతేడాది చివర్లో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణేలు ఇటలీ దేశంలో మిలాన్ నగరంలో లేక్‌కోమోలో కొంకణి, సింధీ రెండు వివాహా పద్థతుల్లో ఒకటైయ్యారు.
అంతకు ముందు అనుష్క శర్మ, విరాట్ కోహ్లి మూడు ముళ్లలతో ఒక్కటయ్యారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం సినిమా నటుడు కాదు. కానీ సినిమావాళ్లకు మించిన గ్లామర్ క్రికెటర్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంతం.
తాజాగా ఒకింటి వారయైన జంటల్లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కూడా ఉన్నారు. వీరిద్దరు క్రిష్టియన్, హిందూ రెండు సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహాం జరిగింది. గత కొన్నేళ్లుగా పీకలోతు ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు రాజస్థాన్ జోథ్‌పూర్‌లో ఉన్న మెహ్రాన్ఘడ్ కోటలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
బాలీవుడ్లో ప్రియాంక, నిక్ జోనస్లే కాదు ఇంకా చాలా మంది నాయికా, నాయకలు మూడు ముళ్లతో వాళ్ల ప్రేమ బంధాన్ని పదిలం చేసుకున్నారు. బాలీవుడ్ తొలి తరం నటీనటులు దిలీప్ కుమార్, సైరాభానులు వాళ్ల రీల్ లైఫ్ కెమిస్ట్రీని రియల్ లైఫ్‌లో కంటిన్యూ చేసి వివాహ బంధంతో ఒకటైనారు.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కలిసి నటించి దేవానంద్, కల్పనా కార్తీక్‌లు మూడు ముళ్ల బందంతో ఒకటయ్యారు.
మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు షమ్మీ కపూర్, గీతాబాలిలు కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించిన తర్వాతనే నిజ జీవిత భాగస్వాములయ్యారు.
బాలీవుడ్ నట గాయకుడు కిషోర్ కుమార్ జీవితంల ఎంతో మంది జీవిత భాగస్వాములున్న...హీరోయిన్ మధుబాలతో ఈయన పండించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ...బిహైండ్ ది స్క్రీన్ కంటిన్యూ చేసి ఆ తర్వాత వీరి ప్రేమను...పెళ్లి పీఠల వరకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఆన్ స్క్రీన్ రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాలు కలిసి నటించకపోయినా..జీవిత భాగస్వాములయ్యారు.
ఇక బాలీవుడ్ల మరో ఎవర్ గ్రీన్ జంటధర్మేంద్ర, హేమామాలినిది. ఎన్నో సూపర్ హిట్ సిన్మాలల్ల వెండితెర భాగస్వాములుగా కలిసి నటించిన వీళ్లిద్దరు ఆ తర్వాత నిజ జీవితంలో ఒకింటి వారయ్యారు.
అదే రకంగా రిషీకపూర్, నీతూ సింగ్ ఎన్నో సిన్మాలల్ల కలిసి నటించిన తర్వాతే ప్రేమ వివాహం చేసుకున్నారు.
మరోవైపు వినోద్ మెహ్రా, బిందియా గోస్వామిలు కూడా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాతే ప్రేమబంధంతో ఒకటయ్యారు.
శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హాలు ఒకటి రెండు సినిమాల్లో కలిసి నటించిన తర్వాతే మూడు ముళ్లతో ఒకటయ్యారు.
ఇక బాలీవుడ్లో చెప్పుకోవాల్సిన మరో ఎవర్ గ్రీన్ జంట అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అమితాబ్ బచ్చన్, జయభాదురిలది. వీళ్లిద్దరు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు వాళ్ల రీల్ లైఫ్ ప్రేమను ...రియల్ లైఫ్‌లో కంటిన్యూ చేసి జీవిత భాగస్వాములయ్యారు.
అటు అమితాబ్, జయభాదురిల ముద్దుల కొడుకు అభిషేక్ బచ్చన్...కూడా ఆయన తోటి హీరోయినైనా ఐశ్వర్యారాయ్‌నే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
వీళ్లిద్దరి కంటే ముందు...అజయ్ దేవ్‌గణ్, కాజల్‌లు ఆన్ ది స్క్రీన్ ఇష్క్ చేసుకొని...ఆఫ్ ది స్క్రీన్‌లో ఆలు మగలయ్యారు.
అటు అక్షయ్, ట్వింకల్ ఖన్నాలు ఈ రకంగానే సినిమాలో ప్రేమయాయాణాన్ని చివరి వరకు కంటిన్యూ చేసి వాళ్ల లవ్‌ను సక్సెస్ చేసుకున్నారు.
అటు సైఫ్, కరీనాలు ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన తర్వాతనే బెబోను ఆమె వైప్ గా చేసుకున్నాడు సైఫ్.
అటు సైఫ్ మొదటి వైఫ్ అమృతాసింగ్ కూడా ఒకప్పటి హీరోయినే.
అటు చోటా పటౌటి చెల్లెలు సోహా అలీ ఖాన్ కూడా హీరో అయిన కునాల్ ఖేమునే పెళ్లాడింది.
‘తుజే మేరి కసమ్’, ‘మస్తీ’ సినిమాల్లో కలిసి నటించిన రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాలు ఆ తర్వాత వివాహ బంధంతో ఒకటయ్యారు.
మరోవైపు ‘ఆలోన్’ సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్లు ఆ తర్వాత వాళ్ల రొమాన్స్‌ను ఆఫ్ ది స్క్రీన్ కూడా కంటిన్యూ చేసి మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.
మరోవైపు కొంతమంది హీరో, హీరోయిన్లు వేరే రంగాల వారిని పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి బాలీవుడ్లో ఎన్నో రీల్ లైఫ్ ప్రేమలు...రియల్ లైఫ్ పెళ్లితో శుభం కార్డ్ వేసుకున్నాయి.
ఇది కూడా చదవండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Abhishek Bachchan, Aishwarya Rai, Ajay Devgn, Akshay Kumar, Amitabh bachchan, Bollywood, Deepika Padukone, Hindi Cinema, Nick jonas, Priyanka Chopra, Ranveer Singh