Valentine's Day 2020: సన్నీ లియోన్ ‘ప్రేమికుల రోజు’ ప్లాన్స్ ఇదే

Sunny Leone V-day Plan | ప్రతియేటాలానే ఈ సారి వాలెంటైన్స్ డే(ఫిబ్రవరి 14)ని కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు బాలీవుడ్ ఐటమ్ గర్ల్ సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ ప్లాన్ చేకుకున్నారు. ఇవాళ తాము ఏమి చేయబోతున్నామో ఓ ఇంటర్వ్యూలో వారిద్దరూ వెల్లడించారు.

news18-telugu
Updated: February 14, 2020, 7:23 AM IST
Valentine's Day 2020: సన్నీ లియోన్ ‘ప్రేమికుల రోజు’ ప్లాన్స్ ఇదే
సన్నీ లియోన్ (Instagram/sunnyleone)
  • Share this:
ప్రేమ జంటల పండుగ రోజు వాలెంటైన్స్ డే  వచ్చేసింది.  బాలీవుడ్ నటి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబెర్ ప్రతియేటాలానే ఈ సారి కూడా ‘వాలెంటైన్స్ డే’ని గ్రాండ్‌గా జరుపుకోనున్నారు. మాజీ పోర్న్ స్టార్ సన్నీ, డేనియల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. కొంతకాలం పాటు డేటింగ్ తర్వాత 2009 జనవరిలో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 10 ఏళ్లుగా వారిద్దరూ అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఇతర ప్రేమ జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈసారి ‘వాలెంటైన్స్ డే’కి తమ ప్లాన్ ఏంటో డేనియల్ ఓ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బిజీ షెడ్యూల్‌లో కూడా వాలెంటైన్స్ డే రోజున రొమాంటిక్ డిన్నర్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు.

వీ-డే ప్లాన్స్ ఇదే...
ప్రేమికుల రోజున తాను ఓ పని మీద ఢాకాకు వెళ్తున్నట్లు చెప్పిన డేనియల్ వెబెర్...సాయంత్రానికే ముంబైకి వెనుదిరిగి వస్తానని తెలిపారు.  ప్రేమికుల రోజున సగం రోజు లవ్లీ వైఫ్ సన్నీని మిస్ అవుతానని తెలిపారు. అయితే రాత్రి తన ప్రియమైన భార్యను డిన్నర్‌కు తీసుకెళ్తానని వెల్లడించారు. ఢాకా టూర్‌ని బుక్ చేసుకోవటానికి ముందే సన్నీ నుంచి అప్రూవల్ తీసుకున్నట్లు వెల్లడించారు. సగం రోజు పాటు ముగ్గురు పిల్లలు నిషా, నోవా, అషెర్‌తో గడపనున్నట్లు చెప్పిన సన్నీ లియోన్...ఆ తర్వాత డేనియల్‌తో డిన్నర్‌కు వెళ్లనున్నట్లు చెప్పింది.

భర్త డేనియల్, ముగ్గురు పిల్లలతో సన్నీ లియోన్
ప్రేమకు అర్థం ఏంటి?
ప్రేమకు అర్థం ఏంటన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన సన్నీ లియోన్..‘ప్రేమకు అర్థం చాలా సింపుల్..అందమైన భార్య..సంతోషకరమైన జీవితమ’ని నవ్వుతూ చెప్పింది. సంతోషకరమైన వివాహ జీవితానికి సర్దుకుపోవడం చాలా ముఖ్యమని సన్నీ భర్త డేనియల్ నవ్వేశారు.

ఇది కూడా చదవండి

Valentine's Day 2020: నిజమైన ప్రేమకు ప్రతీక సన్నీ లియోన్ లవ్ స్టోరీ

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు