Home /News /movies /

VAKEELSAAB MAGUVA MAGUVA FULL SONG OUT SR

పవన్ కళ్యాణ్ ఉమెన్స్ డే గిఫ్ట్.. మగువా మగువా సాంగ్ వచ్చేసింది..

ఇప్పటికే ఈ సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన మగువా మగువా అనే సాంగ్ సంచలనం సృష్టించింది.  Photo : Twitter

ఇప్పటికే ఈ సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన మగువా మగువా అనే సాంగ్ సంచలనం సృష్టించింది. Photo : Twitter

#VakeelSaab : పవన్ కళ్యాణ్ ఉమెన్స్ డే గిఫ్ట్.. మగువా మగువా సాంగ్ వచ్చేసింది.

    #VakeelSaab : పవన్ కళ్యాణ్  'వకీల్ సాబ్' సినిమా నుంచి మగువా మగువా సాంగ్ వచ్చేసింది. ఉమెన్స్ డే  సందర్భంగా ఈ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. దీంతో విడుదలకు సిద్దమవుతోంది. అందులో భాగంగా మార్చ్ 8న ఉమెన్స్ డే సందర్భంగా 'మగువ మగువ' పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన ప్రోమో సాంగ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. లేటెస్ట్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ ఈ పాట పాడగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు.. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవన్ అభిమానులు అయితే ఈ పాట విని పండగ చేసుకుంటున్నారు. 'మగువ మగువ.. ఈ లోకానికి తెలుసా నీ విలువా' అంటూ సాగే ఈ పాట ఖచ్చితంగా వైరల్ అయ్యేలా కనిపిస్తుంది. సమ్మర్‌ను టార్గెట్ చేసుకుని మే 15న 'వకీల్ సాబ్' విడుదల కానుంది. MCA  ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకుడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Vakeel Saab, Womens Day 2020

    తదుపరి వార్తలు