హోమ్ /వార్తలు /movies /

Vakeel Saab : అమెజాన్ ప్రైమ్‌లో ఈరోజు నుంచి వకీల్ సాబ్.. ఎర్లీ స్ట్రీమింగ్‌తో మరో 12 కోట్లు లాభం..

Vakeel Saab : అమెజాన్ ప్రైమ్‌లో ఈరోజు నుంచి వకీల్ సాబ్.. ఎర్లీ స్ట్రీమింగ్‌తో మరో 12 కోట్లు లాభం..

Pawan Kalyan Vakeel Saab : వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వకీల్ సాబ్’.

Pawan Kalyan Vakeel Saab : వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వకీల్ సాబ్’.

Pawan Kalyan Vakeel Saab : వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వకీల్ సాబ్’.

  Pawan Kalyan Vakeel Saab : వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా ఈ రేంజ్‌లో వసూళ్లు అంటే మాటలు కాదు. ముఖ్యంగా మొదటి మూడు రోజులు అదిరిపోయే కలెక్షన్స్‌ వచ్చాయి. ఇక ఆ తర్వాత పెద్దగా రాబట్టలేకపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటకు రావాడానికి బయపడుతున్నారు. అలాంటిదీ సినిమా కోసం అంటే ఆలోచిస్తున్నారు. దీంతో ఆల్రెడీ థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ కూడా ఓటీటీ బాట పట్టింది. ఈ చిత్రం మే 30 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుత సమయంలో థియేటర్‌లో చూసేవారి సంఖ్య పూర్తిగా తగ్గడంతో ఒప్పందం డేట్ కన్న ముందుగానే స్ట్రీమింగ్ అవుతోంది.

  అయితే ఇక్కడో విషయం గమనించాల్సి ఉంది. టాలీవుడ్ నిర్మాతలు ఓటీటీలతో చేసుకున్న ఒప్పందం మేరకు సినిమా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ విడుదలకు మధ్య కనీసం నెలన్నర గ్యాప్ ఉండాలి.. అనేదీ ఓ కండీషన్. కానీ ‘వకీల్ సాబ్’ విషయంలో ఇది కుదరలేదు. చిత్రం విడుదలై నెలరోజులు కూడ గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది. అంటే ఈరోజు నుంచే అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. ఇది కావాలని చేసింది కాదు. వకీల్ సాబ్ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందన్నారు.

  కానీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడం, కేసులు పెరగడంతో థియేటర్లు మూతపడటం జరిగింది. రావాల్సిన స్థాయిలో ఈ సినిమాకు వసూళ్లు రాలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు ఓటీటీ ఎర్లీ రిలీజ్ ఆప్షన్ ఎంచుకున్నారు. అందులో భాగంగా 30వ తేదీ అంటే ఈరోజు రాత్రి నుండి స్ట్రీమింగ్ అవ్వడానికి ఓకే అనేశారు. ఈ ముందస్తు విడుదల ద్వారా నిర్మాతకు రూ.12 కోట్ల వరకు అదనపు లాభం చేకూరినట్టు సమాచారం. ఇక మరోవైపు అభిమానులు, థియేటర్లలో సినిమాను మిస్సైన వారు ‘వకీల్ సాబ్’ను ఓటీటీలో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు.

  Pawan Kalyan Vakeel Saab, the remuneration of shruti haasan anjali and nivetha thomas for acting vakeel saab, Vakeel Saab Overseas collections, Vakeel Saab Collections,pawan kalyan,Vakeel Saab 8 days collections,pawan kalyan Vakeel Saab 8 days ww collections,Vakeel Saab 8 days world wide collections,Vakeel Saab 8 days collections 79 crores,telugu cinema,వకీల్ సాబ్,వకీల్ సాబ్ కలెక్షన్స్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 8 డేస్ కలెక్షన్స్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 8 డేస్ కలెక్షన్స్
  దర్శకుడు వేణుతో అనన్య, అంజలి, నివేదా Photo : Twittter

  ఇక తాజాగా మరో వార్త ఏమంటే.. దిల్ రాజు పవన్ కళ్యాణ్‌తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారట. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే పేరును ఖరారు చేసారు.

  pawan kalyan,Vakeel Saab 2 weeks WW collections,vakeel saab movie,vakeel saab movie collections,Vakeel Saab 2 weeks collections,pawan kalyan vakeel saab movie 14 days ww collections,pawan kalyan vakeel saab movie,telugu cinema,పవన్ కళ్యాణ్,వకీల్ సాబ్ కలెక్షన్స్,వకీల్ సాబ్ 2 వీక్స్ కలెక్షన్స్
  వకీల్ సాబ్  (Vakeel Saab)

  ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుందని టాక్. ఈ సినిమాతో పాటు పవన్.. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రుద్రపత్రాప్ అనే టైటిల్‌ను పరిశీలినలో ఉంది.

  First published:

  ఉత్తమ కథలు