• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VAKEEL SAAB MOVIE PRODUCER DIL RAJU TESTED CORONA POSITIVE AND CHIRANJEEVI TENSED PK

Dil Raju Corona Positive: ‘వకీల్ సాబ్’ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో చిరంజీవి..

Dil Raju Corona Positive: ‘వకీల్ సాబ్’ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో చిరంజీవి..

దిల్ రాజు Photo : Twitter

Dil Raju Corona Positive: పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) సినిమా నిర్మించాలన్న 22 ఏళ్ళ కలను నెరవేర్చుకున్న ఆనందంలో ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేసాడు దిల్ రాజు(Dil Raju). ప్రెస్ మీట్స్ పెట్టడం.. బయట అభిమానులను కలవడం లాంటివి చేసాడు. దాంతో ఈయనకు ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో కరోనా కేసులు రోజురోజుకీ దారుణంగా పెరిగిపోతున్నాయి. కంట్రోలో కూడా చేయలేని స్థాయికి కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తాజాగా వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డాడు. కొన్ని రోజులుగా ఈయన బయటే ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఆడియన్స్‌ను కలిసాడు.. డిస్ట్రిబ్యూటర్లతో మీట్ అయ్యాడు.. దాంతో పాటు ప్రమెషన్స్ కోసం థియేటర్స్ కూడా తిరిగాడు. ఇప్పుడు ఈయనకు పాజిటివ్ రావడంతో అంతా కంగారు పడుతున్నారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలన్న 22 ఏళ్ళ కలను నెరవేర్చుకున్న ఆనందంలో ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేసాడు దిల్ రాజు. ప్రెస్ మీట్స్ పెట్టడం.. బయట అభిమానులను కలవడం లాంటివి చేసాడు. దాంతో ఈయనకు ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు పాజిటివ్ వచ్చిందనే విషయం తెలిసిన వెంటనే హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు దిల్ రాజు. తనను కొన్ని రోజులుగా కలిసిన వాళ్లంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరాడు దిల్ రాజు. ఈయన్ని కొన్ని రోజులుగా దర్శకుడు శ్రీరామ్ వేణు అంటిపెట్టుకునే ఉన్నాడు.

దాంతో ఇప్పుడు ఆయనకు కూడా కరోనా భయం పట్టుకుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు రోజుల కిందే వకీల్ సాబ్ సక్సెస్ సందర్భంగా దిల్ రాజు, శ్రీరామ్ వేణులను సత్కరించాడు. దాంతో ఇప్పుడు ఆయనకు కూడా కంగారు మొదలైంది. ఇప్పటికే వకీల్ సాబ్ యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా వచ్చింది. ఆమెకు నెగిటివ్ కూడా రావడంతో థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో పాటు సినిమాను ఎంజాయ్ చేసింది.
Dil Raju Corona Positive,Dil Raju covid Positive,Dil Raju vakeel saab movie,Dil Raju covid 19,Dil Raju movies,Dil Raju pawan kalyan vakeel saab,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు కరోనా పాజిటివ్,దిల్ రాజు కోవిడ్ పాజిటివ్,దిల్ రాజు వకీల్ సాబ్
వకీల్ సాబ్ దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజులను సత్కరించిన చిరు (Twitter/Photo)

ఇప్పుడు దిల్ రాజుకు పాజిటివ్ రావడంతో వెంటనే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఉద్యోగులతో పాటు అంతా అప్రమత్తమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి చాలా సినిమాలు వస్తున్నాయి. విశ్వక్ సేన్ పాగల్.. అవసరాల శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అందగాడు.. శంకర్, రామ్ చరణ్ సినిమా.. అల్లు అర్జున్ ఐకాన్.. జెర్సీ రీమేక్.. ఎఫ్ 3 సినిమాలు వస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు