• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VAKEEL SAAB MOVIE MAGUVA MAGUVA FEMALE VERSION SONG GETS EMOTIONAL EVERYONE AND HERE THE INSPIRATIONAL LYRICS PK

Vakeel Saab Maguva Maguva: ‘వకీల్ సాబ్’ మగువ మగువ ఫీమేల్ వర్షన్ సాంగ్.. ఎంత గొప్ప లిరిక్స్ ఇవి..

Vakeel Saab Maguva Maguva: ‘వకీల్ సాబ్’ మగువ మగువ ఫీమేల్ వర్షన్ సాంగ్.. ఎంత గొప్ప లిరిక్స్ ఇవి..

మగువ మగువ ఫీమేల్ సాంగ్ (Maguva Maguva)

Vakeel Saab Maguva Maguva: పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సమయంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను తీసుకొస్తుంది. ఈ చిత్ర విజయంలో సంగీత దర్శకుడు థమన్ పాత్ర కూడా ఎంతో ఉంది.

  • Share this:
పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సమయంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను తీసుకొస్తుంది. ఈ చిత్ర విజయంలో సంగీత దర్శకుడు థమన్ పాత్ర కూడా ఎంతో ఉంది. ముఖ్యంగా ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. పాటలు సినిమా రేంజ్ పెంచేసాయి. మగువ మగువ పాట అయితే మరో స్థాయిలో ఉంది. ఏడాదిన్నర కింద విడుదలైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాటలోని లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత మరో పాట కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సినిమాలో మరో స్యాడ్ వర్షన్ అలాగే ఉంచేసారు. అమ్మాయిల పట్ల చూపించే వివక్షను ఈ పాటలో కళ్లకు కట్టినట్లు రాసారు. ఆ లిరిక్స్ చూసి.. పాటను విని కన్నీరు పెట్టుకుంటున్నారు ప్రేక్షకులు. అంత అద్భుతమైన పాటకు సంబంధించిన లిరిక్స్ మీ కోసం..

ఆకాశం తాకే నీ ఆక్రదనాలు.. మనసారా వినువారేవారు
నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు.. సవరించే మనవారేవారు

కళా మారుతున్న జీవితం కలతలోకి జారేన
కలలుగన్న కనులకు నీటిచెమ్మ తగిలేనా
వెళుతురైన ప్రతిదినం చుపుతోంద వేదన
అందమైన బతుకున అలజడి చెలరేగేనా

ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే చిటికలోనే
తీరదు నీ శోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా

మగువా మగువ నీ మనసుకు లేదా ఏ విలువ..
మగువ మగువ నీ తలరాతలో చిరునవ్వులు కలవా ....

అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు
అనాది కాలంగా అబలవే నువ్వు
నిందలు వేస్తారు నిను వెలివేస్తారు
ఆడదిగా నువ్వు పొరబడి పుట్టవు

మగువ మగువ నీ మనసుకు లేదా ఏ విలువ.....
మగువ మగువ నీ తలరాతలో చిరునవ్వులు కలవా....
Published by:Praveen Kumar Vadla
First published: