• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VAKEEL SAAB FILM WILL BE HELP FOR HEROINE ANJALI NR

Anjali: వకీల్ సాబ్ వల్ల అంజలికి ఏమైన కలిసొస్తుందా?

Anjali: వకీల్ సాబ్ వల్ల అంజలికి ఏమైన కలిసొస్తుందా?

anjali

Anjali: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

  • Share this:
    Anjali: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమా మంచి విజయవంతం కావడంతో అంజలికి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత గీతాంజలి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రమంగా అంజలికి ఇటు తెలుగులో, అటు తమిళంలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

    ఎటువంటి సినీ అవకాశాలు లేకపోవడంతో అంజలి తన శరీర ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టి బాగా సన్నబడతారు. అంజలి తన స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే అంజలి పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. అదే విధంగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వీలైనంత గ్లామర్ షో చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఏప్రిల్ 9న వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

    వకీల్ సాబ్ సినిమాలో అంజలి పాత్ర ఎంతో కీలకమైనది. అదే విధంగా ఈ సినిమాలో నటించిన మరొక హీరోయిన్ నివేద థామస్, అంజలి పాత్ర సినిమా హైలెట్స్ లో ఒక భాగమని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్న అంజలికి వకీల్ సాబ్ సినిమా మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందా.. ఈ సినిమా అంజలి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? టాలీవుడ్ హీరోలు అంజలికి అవకాశాలు ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే. సాధారణంగా ఒక హీరోయిన్ ఒక సినిమాలో నటించి మంచి విజయం అందుకుంటే వారికి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. మరి అంజలి విషయంలో ఏమవుతుందో వేచి చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    అగ్ర కథనాలు